Flipkart Discount offers: సెప్టెంబర్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఆఫర్ల జాబితా ఇదే

Flipkart Big Billion Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి డిస్కౌంట్ ఆఫర్లు తీసుకొచ్చింది. వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 10, 2024, 04:06 PM IST
Flipkart Discount offers: సెప్టెంబర్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఆఫర్ల జాబితా ఇదే

Flipkart Big Billion Days Sale 2024: ఇప్పుడు వచ్చేది పండుగ కాలం. దసరా, దీపావళి పండుగలు రానున్నాయి. బహుశా అందుకే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రారంభించనుంది. సెప్టెంబర్ 30 నుంచి మొదలుకానున్న ఈ సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపు లభించనుంది. దీనికి సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్లు లీక్ అయ్యాయి. 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వివిధ కంపెనీల ల్యాప్‌టాప్‌లు, హెడ్ ఫోన్స్, గేమింగ్ కన్సోల్స్, రిఫ్రిజిరేటర్లు, టెక్ యాక్సెసరీస్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్లపై కూడా ప్రత్యేక తగ్గింపు లభించనుంది. ఈ ఆఫర్లతో పాటు వివిధ బ్యాంకులు అందించే ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్, నో కాస్ట్ ఈఎంఐలు వర్తిస్తాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ లభించనుంది ఇందులో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా స్మార్ట్‌టీవీలు  ఇతర హోమ్ అప్లయన్సెస్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్ ఉంది. స్మార్ట్ టీవీలపై 80 శాతం డిస్కౌంట్ ఉంటే, మరికొన్ని హోమ్ అప్లయన్సెస్‌పై 75 శాతం తగ్గింపు ఉంది.

ఇక నథింగ్, రియల్ మి, ఎంఐ, ఇన్ఫినిక్స్ వంటి స్మార్ట్‌ఫోన్లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్ లభించనుంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్ కాకుండా బ్యాంకులు ఇచ్చే క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంటాయి. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఈ ఈఫర్లు వర్తించనున్నాయి. కస్టమర్లు తమ పాత ఫోన్లు, లేదా ల్యాప్‌టాప్‌లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. 

స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు కొనే ఆలోచన ఉంటే ఎలాంటి అదనపు వడ్డీ లేకుండానే నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్ సంస్థ. కస్టమర్లకు మరింత అదనపు ప్రయోజనం కల్గించేందుకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్ కూపన్లు ఉంటాయి. 

Also read: Sugar vs Jaggery: మధుమేహం వ్యాధిగ్రస్థులకు పంచదార, బెల్లంలో ఏది మంచిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News