Sugar vs Jaggery: మధుమేహం వ్యాధిగ్రస్థులకు పంచదార, బెల్లంలో ఏది మంచిది

Sugar vs Jaggery: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. అదే సమయంలో ప్రజల్లో కూడా డయాబెటిస్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఏది తినవచ్చు, ఏది తినకూడదనే సందేహాలు ఎక్కువగా ఉంటున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 10, 2024, 11:14 AM IST
Sugar vs Jaggery: మధుమేహం వ్యాధిగ్రస్థులకు పంచదార, బెల్లంలో ఏది మంచిది

Sugar vs Jaggery: మధుమేహం వ్యాధికి పూర్తి చికిత్స లేనేలేదు. కేవలం నియంత్రణ ఒక్కటే మార్గం. మధుమేహం నియంత్రణ అనేది పూర్తిగా మన చేతుల్లో ఉన్నదే. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్ని రకాల ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు పదే పదే హెచ్చరిస్తుంటారు. ఈ క్రమంలో ప్రధానంగా విన్పించే ప్రశ్న షుగర్ వర్సెస్ బెల్లం. రెండింట్లో ఏది మంచిదనేది.

డయాబెటిస్ నియంత్రణలో భాగంగా చాలామంది షుగర్‌కు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడుతుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే సందేహం చాలామందిలో ఉంటుంది. చక్కెర అనేది ప్రోసెస్డ్ స్వీట్‌నర్. బెల్లం సహజసిద్ధమైన స్వీట్‌నర్. రెంటూ చెరకు నుంచి వచ్చే ఉత్పత్తులే. రెండింట్లోనూ ఒకే విధమైన కేలరీలు ఉంటాయి. ప్రభావం కూడా ఒకటే ఉంటుంది. అయినా సరే చాలామంది పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం వినియోగిస్తుంటారు. చక్కెర, బెల్లం రెండూ చెరుకు నుంచే వచ్చేవే అయినా రెండింటి తయారీలో తేడా ఉంటుంది. 

చక్కెరను తిన్న చిన్న స్పటికాలుగా ప్రోసెస్ చేసి తయారు చేస్తారు. ఈ తయారీలో కొన్ని రసాయనాలు వాడటం వల్ల అందులో ఉండే మినరల్స్, ప్రోటీన్లు నశించిపోతాయి. అంటే రిఫైనింగ్ ప్రక్రయ ఉంటుంది. అయితే బెల్లంమాత్రం చెరుకును మరిగించి తయారు చేస్తారు. రిఫైనింగ్ ప్రక్రియ ఉండదు. దాంతో పోషకాలు బెల్లంలో యధావిధిగా ఉంటాయి.

అందుకే చాలామంది పంచదారకు ప్రత్యామ్నంగా బెల్లం వినియోగిస్తారు. కానీ డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు బెల్లం మంచిది కదా అనే ఉద్దేశ్యంతో ఎక్కువ తీసుకోకూడదు. మితంగానే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే పంచదారతో పోలిస్తే బెల్లంతో ముప్పు కాస్త తక్కువ. ఎందుకంటే బెల్లం నెమ్మదిగా జీర్ణం కావడం విల్ల రక్తంలో షుగర్ స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. 

సాధ్యమైనంతవరకు డయాబెటిస్ వ్యాదిగ్రస్థులు ఈ రెండూ తినకపోవడమే మంచిది. బెల్లం లేదా పంచదారతో తయారు చేసే స్వీట్లకు దూరంగా ఉంటే అన్ని విధాలా మంచిది. 

Also read: Painkiller Tablets: పీరియడ్స్ సమయంలో మహిళలు పెయిన్ కిల్లర్ మందులు వాడవచ్చా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News