Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.11 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.749కే

Flipkart Electronics Sale: డెడ్ చీప్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. భారీ డిస్కౌంట్స్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ పొందవచ్చు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 25, 2022, 02:19 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్ సేల్
  • జూన్ 23 నుంచి జూన్ 27 వరకు
  • అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్
Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.11 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.749కే

Flipkart Electronics Sale: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌‌ ఎలక్ట్రానిక్ సేల్ పేరిట బంపరాఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే అతి చౌక ధరకే మీ ఫేవరెట్ బ్రాండ్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సేల్‌లో భాగంగా పోకో బడ్జెట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.11 వేలు విలువ చేసే పోకో సీ31 (రాయల్ బ్లూ, 32 జీబీ) స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.749కే కొనుగోలు చేయవచ్చు.

ఎలక్ట్రానిక్ సేల్.. బిగ్ డిస్కౌంట్ ఆఫర్ :

పోకో సీ31 (రాయల్ బ్లూ, 32 జీబీ) స్మార్ట్ ఫోన్‌ సాధారణ ధర రూ.10,999. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో 36 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే.. రూ.4 వేలు ఆదా అయినట్లే. కేవలం రూ.6,999కే ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ని అందిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడినట్లయితే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. అంటే మరో రూ.349 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ ఫోన్‌ని మరింత చౌకగా.. రూ.6650కే పొందవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.749కే :

 పోకో సీ31 (రాయల్ బ్లూ, 32 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే దాని కండిషన్‌ని బట్టి రూ.6250 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ పూర్తిగా వర్తించినట్లయితే రూ.6999కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ని డెడ్ చీప్‌గా రూ.749కే పొందవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. జూన్ 23 నుంచి 27 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. 

పోకో సీ31 (రాయల్ బ్లూ, 32 జీబీ) ఫీచర్స్ :

3జీబీ ర్యామ్ 
16.59 సెం.మీ హెచ్‌డీ డిస్‌ప్లే
13 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 mAh బ్యాటరీ సామర్థ్యం
మీడియాటెక్ హిలియో జీ35 ప్రాసెసర్ 

 

Also Read: AP Govt: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..పే స్కేల్‌ ఫిక్స్ చేసిన ప్రభుత్వం..!

Also Read: Amit sha :19 ఏళ్ల పాటు మోడీ నరకయాతన! తన ఆప్త మిత్రుడి బాధను చెప్పిన అమిత్ షా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News