Gold-Silver Rates Today august 22 : బంగారం ధరలు ఆగస్టు 22వ తేదీ గురువారం భారీగా పెరిగాయి. నిన్న బుధవారంతో పోసి చూసినట్లయితే బంగారం ధరలు 10 గ్రాముల పైన 500 రూపాయలు పెరిగింది. అయితే బంగారం ధరలు గత వారంతో పోల్చి చూసినట్లయితే దాదాపు 1500 రూపాయలు ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా హైదరాబాదులో బంగారం ధరలను గమనించినట్లయితే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,210గా పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,110గా పలుకుతోంది. బంగారం ధరలు వరుసగా పెరగడం వెనక అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా బంగారం ధరలు అమెరికా కమోడిటీ ఎక్స్ చేంజీలో ప్రస్తుతం ఒక ఔన్సు అంటే సుమారు 31 గ్రాముల పసిడి ధర 2500 డాలర్లు పైన ట్రేడవుతోంది. గత వారంతో పోల్చితే 100 డాలర్లు పెరిగింది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ నెలలో బంగారం ధర సుమారు 3000 రూపాయల వరకు పెరిగింది. ఈ నెలలో బంగారం ధర కనిష్టంగా 69 వేల రూపాయల వరకు ట్రేడ్ అయింది. అక్కడ నుంచి చూసినట్లయితే బంగారం ధర ప్రస్తుతం 72000 దాటింది. ఈ లెక్కన చూస్తే బంగారం ధర ఈ నెలలో 3000 రూపాయలు పెరిగింది.బంగారం ధరలు భారీగా పెరగడంతో అటు పసిడి ప్రియులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Zomato-Paytm: పేటీఎం ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ బిజినెస్ ఇకపై జొమాటో పరం.. డీల్ విలువ ఎంతంటే..?
మరోవైపు బంగారం ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల ఇలాంటి పెరుగుదలకు ఆస్కారం లభించిందని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం ధర దాదాపు 75,000 రూపాయలు దాటి అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ప్రియులు మరోసారి రికార్డు ధరను చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగారం ధరలు రికార్డు స్థాయి వద్ద ఈ సంవత్సరం 75 వేల రూపాయల సమీపంలో నమోదు అయ్యాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే దీపావళి నాటికి బంగారం ధర 80వేల రూపాయలు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు వెండి ధర కూడా ఆకాశాన్ని తాకుతుంది. వెండి ఒక కిలో ధర హైదరాబాద్‌లో రూ.92,100గా ఉంది. బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతూ ఉంటాయి. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ భేటీ జరగనుంది. దీని ప్రభావం బంగారంపై నేరుగా పడే అవకాశం ఉంది.
Also Read : Gold Investment: బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఫిజికల్ గోల్డ్ బదులు ఇలా ఇన్వెస్ట్ చేసి చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి