Zomato Paytm deal : Paytm బ్రాండ్ మాతృ సంస్థ One 97 Communications Ltd బుధవారం నాడు తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ బిజినెస్ Zomatoకి రూ.2,048 కోట్లకు విక్రయించనున్నట్లు తెలిపింది. సినిమాలు, క్రీడలు సహా ఇతర ఈవెంట్‌లతో సహా ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని Paytm ఇకపై జోమాటోకు బదిలీ చేయనుంది. వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) బుధవారం తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి సంబంధించిన తుది ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది, ఇందులో సినిమాలులు, క్రీడలు ఈవెంట్ (లైవ్ పెర్ఫార్మెన్స్) టికెటింగ్‌ను జోమాటో లిమిటెడ్‌కు విక్రయించినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.
డీల్ విలువ ఎంతంటే..?
రూ. 2,048 కోట్ల విలువైన ఈ డీల్ ద్వారా పేటీఎం ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారం ఇకపై జొమాటో పరం కానుంది. అయితే జొమాటో ఇప్పటికే. ఈ నెల ప్రారంభంలో, Zomato 'డిస్ట్రిక్ట్'ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో డైనింగ్ టికెటింగ్ (సినిమాలు ఈవెంట్‌లు)తో సహా తన టేక్-అవుట్ వ్యాపారాన్ని ఏకీకృతం చేస్తున్నట్లు ప్రకటించింది. జోమాటో తన కోర్ ఫుడ్ డెలివరీ సేవలతో పాటు హైపర్‌మార్కెట్‌లను సైతం స్థాపించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు తన వ్యాపార విస్తరణ గురించి కూడా తెలిపింది.
ఇకపై అన్ని సేవలు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో లభిస్తాయి:
జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ షేర్‌హోల్డర్‌లకు రాసిన లేఖలో డైనింగ్ అవుట్, సినిమాలు, స్పోర్ట్స్ టికెటింగ్, లైవ్ పెర్‌ఫార్మెన్స్‌లు, షాపింగ్ మరెన్నో ప్లాట్‌ఫారమ్‌లలోకి Zomato ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. Zomato ఇప్పటికే 500 మిలియన్ డాలర్ల వార్షిక స్థూల ఆర్డర్ విలువ కలిగి ఉంది.కంపెనీ ఇప్పటికే లాభదాయకంగా ఉంది.
ఈ డీల్ తో మరింత బలమైన బ్యాలెన్స్ షీట్:
పేటీఎం ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారం 12 నెలల వరకు వ్యవధిలో జోమాటో యాప్ లోకి బదిలీ కానుంది. ఈ లావాదేవీ పేటీఎంకు చాలా ప్రయోజనం చేకూరుస్తుందని, నగదు ఆదాయం బ్యాలెన్స్ షీట్‌ను మరింత బలోపేతం చేస్తుందని పేటీఎం పేర్కొంది. సినిమా టిక్కెట్స్, ఈవెంట్ టిక్కెట్ బుకింగ్ వ్యాపారంలో సైతం విస్తిరంచిన Paytm సంస్థ , సినిమా టిక్కెట్ల విభాగంలో మార్కెట్ లీడర్ BookMyShow కంటే వెనుకబడి ఉంది. కానీ ఫుడ్ డెలివరీ యాప్ zomato చేతుల్లోకి వెళ్లడంతో బుక్ మై షోకు పెద్ద ఎత్తున పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జొమాటో కు పెద్ద ఎత్తున కస్టమర్ బేస్ ఉంది. ఆ కస్టమర్ బేస్ ద్వారా సినిమా టికెటింగ్ వ్యవస్థలో ప్రవేశిస్తే అది అదనపు లాభం చేకూరుస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి