Google 23rd birthday: నేడు'గూగుల్' 23వ బర్త్ డే..పుట్టిన తేదీని ఎందుకు మార్చేశారంటే..

Google Birthday 2021:  గూగుల్ సోమవారం తన 23వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని గుర్తు చేయడానికి, సెర్చ్ ఇంజిన్ దాని హోమ్‌పేజీలో డూడుల్‌తో వచ్చింది. యానిమేటెడ్ డూడుల్‌లో 23 అని వ్రాసిన కేక్ ఉంది, గూగుల్ లో L కి బదులుగా పుట్టినరోజు క్యాండిల్ ఉంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2021, 12:04 PM IST
  • నేడు 'గూగుల్' 23వ పుట్టినరోజు
  • 1998 సెప్టెంబరు 4న గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ స్థాపన
  • ప్రస్తుతం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్
Google 23rd birthday: నేడు'గూగుల్' 23వ బర్త్ డే..పుట్టిన తేదీని ఎందుకు మార్చేశారంటే..

Google Birthday 2021: ప్రపంచ నంబర్‌ వన్‌ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌(Google) తన 23వ పుట్టిన రోజు(సెప్టెంబర్ 27, 2021) ని జరుపుకుంటోంది. అందుకే ఈ రోజు డూడుల్‌లో 23 ప్రత్యేకంగా కనిపింపించేలా డిజైన్ చేసింది గూగుల్. ఐస్‌క్రీమ్స్‌, కేక్స్‌, క్యాండిల్స్‌తో ఈ రోజు డూడుల్‌(doodle) సరికొత్తగా కనిపిస్తోంది. 

23 ఏళ్లు పూర్తి
స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థులు సెర్జే బ్రిన్‌, లారీపేజ్‌లో ఓ చిన్న స్టార్టప్‌గా 1998లో ప్రారంభించారు. వాస్తవానికి 1998 సెప్టెంబరు 4న గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌(search engine Googl) అందుబాటులోకి వచ్చింది. మొదటి ఏడేళ్ల పాటు సెప్టెంబరు 4నే గూగుల్‌ వార్షిక వేడుకుల నిర్వహించే వారు. 1998లో గూగుల్‌(Google) ప్రారంభించినా తొలి ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో పేజ్‌ వ్యూస్‌ రావడంతో 2005లో గూగుల్‌ యానివర్సరీ డేట్‌ని సెప్టెంబరు 4 నుంచి సెప్టెంబరు 27కి మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే తేదిని గూగుల్‌ పుట్టినరోజు(Google Birthday)గా జరుపుతున్నారు. ప్రస్తుతం గూగూల్ ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ భాషలలో శోధనలను ప్రారంభించింది. వరల్డ్ వైడ్ గా 20కి పైగా డేటా సెంటర్లు ఉన్నాయి. 

Also Read: Google Services: గూగుల్ ఎక్కౌంట్ బ్లాక్ కాకూడదంటే ఫోన్ మార్చుకోండి

23 స్పెషల్‌ doodle
గూగుల్‌ సంస్థ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ అన్నీ జింజర్‌బ్రెడ్‌, ఐస్‌క్రీం శాండ్‌విచ్, కిట్‌కాట్‌, లాలిపాప్‌, మార్ష్‌మాలో, ఓరియో, పై ఇలా ఐస్‌క్రీంల పేర్లతోనే ఉంటాయి. తన థీమ్‌కి తగ్గట్టే ఈ రోజు డూడుల్‌లో కూడా ఐస్‌క్రీంలకు పెద్ద పీట వేస్తూనే కేక్‌ను డూడుల్‌(doodle)లో పెట్టింది, ఎల్‌ అక్షరం స్థానంలో క్యాండిల్‌ని ఉంచి వేడుకల ఫ్లేవర్‌ని తెచ్చింది గూగుల్‌. నెవడాలోని బ్లాక్‌ రాక్‌ సిటీలో జరిగిన 'బర్నింగ్‌మ్యాన్‌ ' ఈవెంట్‌ థీమ్‌తో తొలిసారి 1998లో గూగుల్‌ డూడుల్‌(Google Doodle)ని రూపొందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల డూడుల్స్‌ని ఈ సెర్చ్‌ ఇంజిన్‌ రూపొందించింది. 

లారీ పేజ్ స్థానంలో సుందర్ పిచాయ్(Sundar Pichai) అక్టోబర్ 24, 2015 న గూగుల్ సీఈవోగా నియమితులయ్యారు. అనంతరం పిచాయ్ డిసెంబర్ 3, 2019 న గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ సీఈవోగా నియమించబడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News