Gold Testing: గత ఏడాది జూన్ నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరిగా మారింది. అంతకు ముందే ప్రభుత్వం హాల్‌మార్క్ తప్పనిసరి చేసినా.. దాని అమలను వివిధ కారణాల వల్ల వాయిదా వేస్తూ వస్తోంది. ఎట్టకేలకు గత ఏడాది తప్పనిసరి చేసింది. దీనితే ప్రస్తుతం బంగారు ఆభరణాలు హాల్‌మార్క్ ఉంటేనే విక్రయించే వీలుంది.
హాల్ మార్క్ అంటే ఏమటి?
బంగారం స్వచ్ఛతను తెలిపేదే హాల్‌మార్క్. బంగారం స్వచ్చనతను తెలియజేస్తూ.. అది 14, 18, 22 క్యారెట్లలో ఏ క్యాటగిరికి చెందినది అని వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వాధీనంలోని హాల్‌మార్క్ సెంటర్లు మాత్రమే స్వచ్ఛతను నిర్ణయిస్తాయి.
పసిడి విక్రయాల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు 2000 సంవత్సరం నుంచే హాల్‌మార్క్ విధానాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. అయితే అప్పట్లో ఇది తప్పనిసరిగా ఉండేది కాదు.
దేశవ్యాప్తంగా హాల్‌మార్క్ సెంటర్లు గతంతో పోలిస్తే భారీగా పెంచి.. హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.
పాత నగల పరిస్థితి ఏమిటి?
అయితే హాల్‌మార్క్ లేకుండా గతంలో చాలా మంది బంగారు ఆభరణాలు కొన్నారు. దీనితో చాలా మంది తమ వద్ద ఉన్న నగలు స్వచ్ఛతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనితో హాల్‌మార్క్ లేని నగల స్వచ్ఛతను తెలుసుకునేందుకు కేంద్ర వినియోదరాలు వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఎవరైనా తమ వద్ద ఉన్న నగలను హాల్‌మార్క్ కేంద్రాల్లో స్వచ్ఛతను తెలుసుకునే వీలుందని తెలిపింది ప్రభుత్వం.
నాలుగు ఆభరణాలకైతే రూ.200 చెల్లించాలని పేర్కొంది. ఐదు అంతకన్నాఎక్కువ నగలు ఉంటే ఒక్కో ఆభరణానికి రూ.45 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. హాల్‌మార్క్ సెంటర్లలో టెస్టింగ్కోసం ఏం చేయాలి? దగ్గర్లో ఉన్న టెస్టింగ్ సెంటర్లను ఎలా తెలుసుకోవాలి? సహా ఇతర మార్గదర్శకాలన్నిటిని బిస్ (BIS)వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది ప్రభుత్వం.
Also read: Aadhaar Update: ఆధార్‌లో ఫొటో మార్చుకోవాలా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
Also read: Smart TV Offers: రూ.7,749 ధరకే 42 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook