Home Loan: హోంలోన్ EMI భారంగా మారిందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. ఈజీగా తీరిపోతుంది

Home Loan EMI Reducing Tips: సొంతింటి కల నెరవేర్చుకోవడమే మీ లక్ష్యమా? అయితే కొన్ని రకాల సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. అంతే కాదు హోమ్ లోన్ ద్వారా ప్రతినెల మీరు చెల్లించే నెల వాయిదాలను కూడా ఈజీగా క్లియర్ చేసుకునే టిప్స్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటి ద్వారా మీరు ప్రతి నెల చెల్లించే ఈఎంఐ భారం నుంచి తప్పించుకునే అవకాశం లభిస్తుంది.  

Written by - Bhoomi | Last Updated : Sep 12, 2024, 06:58 PM IST
Home Loan: హోంలోన్ EMI భారంగా మారిందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. ఈజీగా తీరిపోతుంది

Home Loan EMI Reducing Tips:  ప్రస్తుత కాలంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలి అంటే.. అందుకోసం మీరు డబ్బులు దాచుకొని మిగిలిన డబ్బులతో ఇల్లు నిర్మించుకోవడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో డబ్బులు పొదుపు చేసి ఆ పొదుపు చేసిన డబ్బుతో ఇల్లు నిర్మించుకోవడం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. అందుకు బదులుగా మీరు బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐ చెల్లించుకుంటే మీ సొంత ఇంటి కల సాకారం అవుతుంది.

సాధారణంగా హోమ్ లోన్ నెల వాయిదాలు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కాలవ్యవధితో తీసుకుంటారు. అయితే మీరు ఎంత ఎక్కువ కాలం తీసుకుంటే అంత తక్కువ ఇఎంఐ అవుతుంది. అయితే మీరు ఎంత తక్కువ కాలు వ్యవధి తీసుకుంటే అంత ఎక్కువ ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రాథమిక సూత్రంగా గమనించాలి. అయితే మీకు రుణం అందించే బ్యాంకులు మీ ఆదాయంలో సగం కంటే తక్కువ మొత్తం ఉన్నప్పుడే హోమ్ లోన్  సాంక్షన్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. హోమ్ లోన్ కోసం మీ పేస్లిప్పులను కూడా అందజేయాల్సి ఉంటుంది. వీటిలో మీ ఆదాయంలో 50 శాతం లోపు ఈఎంఐ ఉండేలా బ్యాంకులు జాగ్రత్త పడతాయి. ఎందుకంటే మీ వేతనంలో సగం కంటే ఎక్కువగా నెల వాయిదాలకే వెళ్ళినట్లయితే మీ రోజువారి జీవితం గడవడం కష్టం అవుతుంది. ఇప్పుడు నెల నెల మీరు చెల్లించే సులభ వాయిదా అయిన ఈఎంఐ తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం.

Also Read: Bajaj IPO : బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు భారీ స్పందన..షేర్ల లిస్టింగ్ ఎప్పుడంటే?

ఈఎంఐ తగ్గాలంటే క్రెడిట్ స్కోర్ మెరుగుపరచుకోవాలి:

మీరు నెల నెల చెల్లించే ఈఎంఐ తగ్గాలంటే మీకు వడ్డీ రేటు తక్కువగా ఉండాలి. వడ్డీ రేటు తగ్గాలంటే మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నప్పుడే వడ్డీ రేటు తగ్గే అవకాశం లభిస్తుంది. సాధారణంగా చాలా బ్యాంకులు 800 కన్నా ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లకు తక్కువ వడ్డీ ధరకు రుణాలను ఆఫర్ చేస్తూ ఉంటాయి. అందుకే మీరు హోమ్ లోన్ అప్లై చేసుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నం చేయండి. పాత బాకీలు ఏమైనా ఉంటే ముందుగానే చెల్లించేసి సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు వంటివి చెల్లిoచడం వల్ల మీరు రుణం బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది.

జాయింట్ లోన్ అప్లై చేస్తే మంచిది:

మీరు దంపతులై ఉండి ఉద్యోగస్తులయితే జాయింట్ లోన్ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఈఎంఐ భారం చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరు తక్కువ కాలవ్యవధి ఎంపిక చేసుకోవడం ద్వారా త్వరగా ఇంటి రుణం చెల్లించవచ్చు చాలా బ్యాంకులు ఇలాంటి రుణాలకు త్వరగా ఆమోదం తెలుపుతాయి.

లోన్ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు:

మీరు నెలవారి ఈఎంఐ భారం తగ్గించుకోవాలనుకుంటే.. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందో గమనించి  ఆ బ్యాంకుకు మీ లోన్ ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Also Read: Business Ideas: కంచికి వెళ్లి ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఇంట్లోనే కూర్చుండి.. నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఛాన్స్  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News