Aadhaar Card: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమౌతోందా..ఇలా చెక్ చేసి..లాక్ చేసుకోండి

Aadhaar Card: ఆధార్ కార్డ్ అనేది భారతదేశపు విశిష్ట గుర్తింపు కార్డు. యూఐడీఏఐ జారీ చేస్తుంది. అందుకే మీరెప్పుడైనా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే..యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ మాత్రమే వినియోగించండి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2022, 10:21 PM IST
Aadhaar Card: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమౌతోందా..ఇలా చెక్ చేసి..లాక్ చేసుకోండి

Aadhaar Card: ఆధార్ కార్డ్ అనేది భారతదేశపు విశిష్ట గుర్తింపు కార్డు. యూఐడీఏఐ జారీ చేస్తుంది. అందుకే మీరెప్పుడైనా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే..యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ మాత్రమే వినియోగించండి.

ప్రస్తుతం ప్రతి పనికి ఆధార్ అవసరం. ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేది కీలమైన డాక్యుమెంట్. ఏ పనైనా సరే..ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. మొబైల్ నెంబర్ తీసుకోవాలన్నా..బ్యాంక్ ఎక్కౌంట్ తెరవాలన్నా..విద్యుత్ కనెక్షన్ అయినా..నీటి కనెక్షన్ అయినా..ఇళ్లు కొనాలన్నా..ఇంటి అద్దెకైనా ఇలా ఏ పనైనా సరే..ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డ్ లేకపోతే ఏ పనైనా సరే అసంపూర్తిగానే ఉంటుంది. ఆధార్ కార్డ్ ఒక్కటే మీ గుర్తింపు. ఈ పనులన్నింటికీ తప్పకుండా ఆధార్ కార్డు కాపీ సమర్పించాల్సిందే. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలకమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మీ ఆధార్ కార్డు కాపీని ఎవరికైనా ఇచ్చేముందు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. లేకపోతే నష్టాలెదురవుతాయి.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సైతం ఆధార్ కార్డు దుర్వినియోగం విషయంలో కీలక సూచనలు జారీ చేసింది.  ఆధార్ కార్డు కాపీని ఎవరితోనూ షేర్ చేయవద్దని సూచించింది. ఆధార్ కార్డు వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని తెలిపింది. ఆధార్ కార్డును బహిరంగ ప్రదేశాల్లో అంటే పబ్లిక్ కంప్యూటర్లలో ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయవద్దని సూచిస్తోంది. 

ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచేందుకు ఆన్‌లైన్ లాక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎంఆధార్ యాప్ వినియోగించాల్సి ఉంటుంది. దీనిద్వారా మీరు మీ బయోమెట్రిక్ లాక్ చేయవచ్చు. దీనికోసం మీకు వర్చువల్ ఐడీ అవసరముంటుంది. ఈ ఐడీ 16 అంకెల రివోకేవల్ నెంబర్ ఉంటుంది. ఈ పదహారంకెల నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో పాటు మ్యాప్ చేస్తారు. దీనిని ఆధార్ హెల్ప్‌లైన్ నెంబరా 1947 పై ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చు. ఇలా మీ ఆధార్ కార్డును మీరు లాక్ చేసుకోవచ్చు.

మాస్క్డ్ ఆధార్ విధానం మీ ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుతుంది.ఈ కార్డును మీరు అనధికారిక సంస్థలకు కూడా ఇవ్వచ్చు. దీనివల్ల మీ ఆధార్ నెంబర్ సురక్షితంగా ఉంటుంది. దీనిని మీరు కూడా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో చివరి 4 అంకెలు మాత్రమే కన్పిస్తాయి. మొదటి 8 అంకెల స్థానంలో ఇంటూ మార్క్స్ ఉంటాయి.

మీ ఆధార్ కార్డును ఈమెయిల్ ఐడీ లేదా ఫోన్ నెంబర్‌తో లింక్ చేయడం ద్వారా సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇది చాలా అవసరం కూడా. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ రెండింటి ద్వారా మీరు మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేయవచ్చు. ఆన్ వెరిఫికేషన్ కోసం myaadhaar.uidai.gov.in/verifyAadhaar క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఆధార్‌పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చేయవచ్చు.

Also read: Amazon Smart TV Offers: అమెజాన్‌లో ఒక్కరోజే ఈ ఛాన్స్.. రూ.20వేలు విలువ చేసే టీవీ కేవలం రూ.5739కే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News