Hybdrid Car vs Electric Car: హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అధిక ప్రయోజనాలు అందిస్తాయి. అయితే ఈ రెండింట్లో అంటే హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రికల్ వాహనాల ప్రస్తావన వచ్చినప్పుడు ఏది బెటర్ అనేది తెలుసుకుందాం.
హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రిక్ కార్ల మధ్య అంతరాలు
హైబ్రిడ్ కార్లలో గ్యాసోలీన్, విద్యుత్ రెండింటితో నడుస్తాయి. ఇందులో ఒక ఎలక్ట్రిక్ మోటార్, ఒక గ్యాసోలీన్ ఇంజన్ ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్ తక్కువ సామర్ధ్యంతో పనిచేస్తుంది. గ్యాసోలీన్ ఇంజన్ బ్యాటరీ తగ్గినప్పుడు పనిచేస్తుంది. అదే ఎలక్ట్రిక్ కార్లలో కేవలం విద్యుత్ ఆధారంగా మాత్రమే పనిచేసే వ్యవస్థ ఉంటుంది. ఇందులో గ్యాసోలీన్ ఇంజన్ ఉండదు.
హైబ్రీడ్ కార్లకు ప్లగ్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు. రీ జనరేటివ్ బ్రేకింగ్ మోడ్‌తో బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటాయి. బ్రేక్ వేసినప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ జనరేటర్ రూపంలో పనిచేస్తుంది. ఇక ఎలక్ట్రిక్ కార్లు ఛార్జింగ్ చేయాలంటే పవర్ అవుట్‌లెట్‌లో ప్లగ్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో లేదా బయట ఏర్పాటు చేసిన వివిధ ఛార్జింగ్ స్టేషన్లలో, ఆఫీసుల్లో ఛార్జింగ్ చేసుకోవల్సి ఉంటుంది.
హైబ్రిడ్ కార్లు సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే ఎక్కువ రేంజ్ కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇందులో గ్యాసోలీన్ ఇంజన్ బ్యాకప్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ త్వరలో మరింతగా పెరగవచ్చు. ప్రస్తుతానికైతే హైబ్రిడ్ కార్లతో పోలిస్తే తక్కువే. హైబ్రిడ్ కార్లు సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే తక్కువ ఖర్చవుతాయి. ఎలక్ట్రిక్ కార్లకు ఎప్పటికప్పుడు ఖర్చు అవుతుంటుంది.
హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెటర్ అనేది సాధారణంగా వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యతల్ని బట్టి ఉంటుంది. ఇంధనం తక్కువ ఖర్చు చేసే కార్లు కావాలంటే ఎలక్ట్రిక్ కార్లు బెస్ట్ ఆప్షన్. అదేే రేంజ్ ఎక్కువగా ఉండి, ప్లగ్ ఇన్ అవసరం లేకుండా ఉండాలంటే హైబ్రిడ్ కారు ఎంచుకోవాలి. ఎక్కువ దూరం తిరిగే అవసరం లేకపోతే ఎలక్ట్రిక్ కార్లు బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
Also read: TOP CNG Cars: 10 లక్షల్లోపు ధరలో లభించే 5 బెస్ట్ సీఎన్జీ కార్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook