Stock Market today: ఒమిక్రాన్ భయాలున్నా మార్కెట్లకు లాభాలు- ఆదరగొట్టిన ఐటీ షేర్లు

Stock Market News: దేశీయ స్టాక్ మార్కెట్లపై వారంలో తొలి రోజు సెషన్​లో లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 153 పాయింట్లు, నిఫ్టీ 27 పాయింట్లు పెరిగాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 04:06 PM IST
  • తేరుకున్న స్టాక్ మార్కెట్లు
  • ఒమిక్రాన్ భయాలున్నా స్వల్ప లాభాలు నమోదు
  • ఆసియా మార్కెట్లు భారీ పతనం
Stock Market today: ఒమిక్రాన్ భయాలున్నా మార్కెట్లకు లాభాలు- ఆదరగొట్టిన ఐటీ షేర్లు

Stock Market Updates: స్టాక్​ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరి దశలో కాస్త (Stocks closing bell) తేరుకోగలిగాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) స్వల్పంగా 153 పాయింట్లు పెరిగి.. 57,260 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజి-నిఫ్టీ ఏకంగా (NSE Nify) 27 పాయింట్ల లాభంతో 17,053 వద్ద స్థిరపడింది.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్​ వేరియంట్​ భయాలు ఉన్నా దేశీయ సూచీలు నేడు లాభాలను నమోదు చేయడం విశేషం. ఐటీ, హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 57,626 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 56,382 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,160 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,782 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. చివరిదశలో తేరుకుని లాభాలతో ముగిసింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్ఈ 30 షేర్లలో 13 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. 17 కంంపెనీలు నష్టాలను నమోదు చేశాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.92 శాతం, హెచ్​సీఎల్​టెక్​ 2.25 శాతం, టీసీఎస్​ 1.61 శాతం, టైటాన్​ 1.42 శాతం, బజాజ్ ఫినాన్స్ 1.41 శాతం లాభాలను గడించాయి.

సన్​ ఫార్మా 2.03 శాతం, ఎన్​టీపీసీ 1.67 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.65 శాతం, నెస్లే ఇండియా 1.35 శాతం, బజాజ్ ఆటో 1.32 శాతం నష్టపోయాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), హాంకాంగ్, థైవాన్ సూచీలు మాత్రం  భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

కాస్త పెరిగిన రూపాయి..

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 23 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.09 వద్ద కొనసాగుతోంది.

Also read: Sovereign Gold Bond: నేటి నుంచి అందుబాటులోకి సార్వ భౌమ పిడి బాండ్లు- గ్రాము బంగారం ధర ఎంతంటే?

Also read: స్వల్పంగా తగ్గిన బంగారం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News