Vande Bharat Sleeper Trains: దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ రైలు ఎప్పుడు, ఎక్కడి నుంచో తెలుసా

Vande Bharat Sleeper Trains Ticket Price: భారతీయ రైల్వే నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన వందేభారత్ రైళ్లలో మరో సౌకర్యం వచ్చి చేరుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభంపై స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 6, 2024, 11:31 PM IST
Vande Bharat Sleeper Trains: దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ రైలు ఎప్పుడు, ఎక్కడి నుంచో తెలుసా

Vande Bharat Sleeper Train Ticket Price: ఫిబ్రవరి 1 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 40 వేల భోగీల్ని వందేబారత్ స్టాండర్డ్ భోగీలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇకపై సుదూర ప్రయాణం చేసే ప్రయాణికులు సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. అంటే త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

Also Read: VVIPS Aya Savitri: సినీ హీరోల 'పిల్లల కేర్‌ టేకర్‌' ఎవరో తెలుసా? వీవీఐపీల ఆయా ఎవరో తెలుసా?

వందేభారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా విశేషమైన ఆదరణ లభిస్తోంది. అదే సమయంలో స్లీపర్ సౌకర్యం లేకపోవడం కాస్త వెలితిగా మారింది. స్లీపర్ సౌకర్యం లేకపోవడంతో వృద్ధులకు అసౌకర్యంగా ఉంటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు వందేభారత్ స్లీపర్ రైళ్లు సిద్ధమౌతున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వందేభారత్ మొదటి స్లీపర్ రైలు మార్చ్ మొదటి వారంలో ప్రారంభం కావచ్చని అంచనా. మార్చ్‌లో ట్రయల్స్, మొదటి రైలు ప్రారంభం తరువాత ఏప్రిల్ మొదటి లేదా రెండవ వారంలో వందేభారత్ స్లీపర్ కొత్త వెర్షన్ రైళ్లు ప్రారంభం కావచ్చు. ఇక అదనంగా ఇదే తరహా రైళ్ల ఉత్పత్తి ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. వందేభారత్ స్లీపర్ కోచ్‌ల తయారీ వేగవంతంగా జరుగుతోందని సమాచారం. 

ప్రస్తుతం దేశంలో 39 రైల్వే రూట్లలో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో అన్నీ ఛైర్ అంటే సిట్టింగ్ సౌకర్యం మాత్రమే ఉంది. ఇప్పుడిక మార్చ్ నుంచి మొట్టమొదటిగా ఢిల్లీృ-ముంబై, ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-పాట్నా మధ్య వందేభారత్ స్లీపర్ రైళ్లు తిరగనున్నాయి. గతంలో ఉన్న స్లీపర్ తరగతి కోచ్‌ల కంటే ఎక్కువ సౌకర్యాలను ప్రయాణికులు వీటిలో పొందనున్నారు. వందేభారత్ స్లీపర్ కోచ్‌లు అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు, డ్యూరబిలిటీ, ఎఫోర్డబిలిటీ కలిగి ఉంటాయని అంచనా. వందేభారత్ స్లీపర్ రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని రైల్వే శాఖ తెలిపింది. 

ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వందేభారత్ రైళ్ల గురించి కీలక ప్రకటన కూడా వెలువడింది. దేశంలో దాదాపు 40 వేల భోగీల్ని వందేభారత్ స్టాండర్డ్ భోగీలుగా మార్చుతున్నట్టు ప్రస్తావించారు. అంతేకాకుండా మూడు రైల్వే కారిడార్లను నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ మూడు కారిడార్ల ద్వారా ఎనర్జీ, మినరల్స్, సిమెంట్, పోర్ట్ కనెక్టివిటీ , హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లుగా ఉంటాయన్నారు. ప్రధానమంత్రి గతి శక్తిలో భాగంగా ఈ కొత్త రైల్వే కారిడార్ల నిర్మాణం జరగనుంది. 

Also read: DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డీఏ 50 శాతంతో పాటు జీతం ఒకేసారి 9 వేలు పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News