DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డీఏ 50 శాతంతో పాటు జీతం ఒకేసారి 9 వేలు పెంపు

DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డీఏతో పాటు ఇక జీతం కూడా భారీగా పెరగనుంది. డీఏ పెంపు ఆమోదం పొందడంతో పాటే జీతం ఒక్కసారిగా పెరగనుంది. ఒకేసారి 9 వేల వరకూ జీతం పెరుగుతుందని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 6, 2024, 11:24 PM IST
DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డీఏ 50 శాతంతో పాటు జీతం ఒకేసారి 9 వేలు పెంపు

7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది చాలా విలవైందిగా చెప్పవచ్చు. జనవరి నెల నుంచి డీఏ 50 శాతం చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి ఆధికారిక ప్రకటన వెలువడకపోయినా ఏఐసీపీఐ ఇండెక్స్ అదే చెబుతోంది. 

ప్రతి నెలా విడుదలయ్యే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతుంటుంది. మొదటిసారి జనవరి నెలలో, రెండవ సారి జూలైలో పెంపు ఉంటుంది. ఈసారి జరిగే పెంపుతో డీఏ 50 శాతానికి చేరుకోనుంది. దాంతో కేంద్ర ప్రభుత్వాలకు డబుల్ బొనాంజా కింద మరో ప్రయోజనం చేకూరనుంది. డీఏ ఒక్కటే పెరగడం కాదు.. జీతం కూడా భారీగా పెరిగిపోనుంది. డీఏ పెంపు ఆమోదం పొందడంతో పాటే జీతంలో భారీగా పెరుగుదల కన్పిస్తుంది. అంటే ఒకే దెబ్బకు జీతం ఏకంగా 9 వేల రూపాయలు పెరగనుంది. అదెలా సాధ్యమనుకుంటున్నా..కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇది జరగనుంది. 

Also Read; VVIPS Aya Savitri: సినీ హీరోల 'పిల్లల కేర్‌ టేకర్‌' ఎవరో తెలుసా? వీవీఐపీల ఆయా ఎవరో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ నిబంధన తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ డీఏ పెంపుపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోవల్సి ఉన్నందున మార్చ్ వరకూ వేచి చూడాల్సి ఉంది. డీఏ పెంపు ఆమోదంతో డీఏ 50 శాతానికి చేరుకోగానే జీతం నేరుగా 9 వేల రూపాయలు పెరగనుంది. మరోవైపు 8వ వేతన సంఘం ఏర్పాటుకు దారితీయనుంది. ప్రతి ఆరు నెలలకోసారి డీఏ పెరుగుతుంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  46 శాతం డీఏ వస్తోంది. జనవరి 2024 నుంచి మరో నాలుగు శాతం పెరగనుంది. అదే అమల్లోకి వస్తే 50 శాతానికి డీఏ చేరుకోనుంది. 2016లో వచ్చిన నిబంధన ప్రకారం డీఏ ఒకసారి 50 శాతానికి చేరుకోగానే..ఆ మొత్తం బేసిక్ శాలరీలో కలిపి డీఏను జీరో చేస్తారు. 

ఈ నిబంధన ప్రకారం అప్పటి వరకూ ఉన్న 50 శాతం డీఏ నేరుగా కనీస వేతనంలో కలిపేయాల్సి ఉంటుంది. 2016లో 6వ వేతన సంఘం అమల్లో ఉండగా అదే జరిగి డీఏ సున్నాకు చేరింది. 7వ వేతన సంఘం ఏర్పడింది. ఇప్పుడు తిరిగి అదే పరిస్థితి. 7వ వేతన సంఘం పూర్తి కావస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పడనుంది.

రూ.9 వేలు పెరగనున్న జీతం

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బెడ్ లెవెల్ బేసిక్ శాలరీ 18000. ప్రస్తుతం డీఏగా 7560 రూపాయలు వస్తోంది. డీఏ జనవరి నుంచి 50 శాతానికి చేరుకుంటే అదికాస్తా 9000 అవుతుంది. 2016 నిబంధన ప్రకారం డీఏ 50 శాతానికి చేరుకోగానే 9000 రూపాయల డీఏను బేసిక్ శాలరీలో కలిపి డీఏను జీరో చేస్తారు. అంటే 18 వేల రూపాయలున్న బేసిక్ శాలరీ కాస్తా ఒకేసారి 27 వేలు అవుతుంది. అంటే ఇక నుంచి డీఏ అనేది  27 వేలపై లెక్కించడం మొదలవుతుంది. డీఏ జీరోకు చేరిన తరువాత 3 శాతం డీఏ పెరిగితే 27 వేలపై లెక్కిస్తే 810 రూపాయలు నెలకు మరోసారి పెరగవచ్చు.

Also read; Visa Free Countries: ఇండియన్ పాస్‌పోర్ట్ విలువ, ఈ 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లి రావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News