Bumper Offer: రూ.4 వేలకి ఐఆర్‌సీటీసీ 'గోవిందం' సమ్మర్‌ టూర్‌

మీకు తెలుసా..? కేవలం రూ.4 వేల రూపాయలకే తిరుపతి స్వామివారి దర్శనం కల్పిస్తున్న ఐఆర్‌సీటీసీ సమ్మర్ ప్యాకేజీని ఇప్పటికే ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారు. ఆ వివరాలు  ఇలా 

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2023, 06:07 PM IST
Bumper Offer: రూ.4 వేలకి ఐఆర్‌సీటీసీ 'గోవిందం' సమ్మర్‌ టూర్‌

Bumper Offer: రెండు మూడు రోజుల సెలవులు వస్తే తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు జనాలు బారులు తీరుతారు. ఇక సమ్మర్ హాలిడేస్‌ కి తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున జనాలు తిరుమలకు వెళ్తారు. ఈ సమ్మర్‌ హాలిడేస్ లో పెద్ద ఎత్తున జనాలు ఉంటారు. దాంతో రెండు రోజులు ప్లాన్‌ చేసుకున్న ట్రిప్ కాస్త నాలుగు రోజుల సమయం తీసుకుంటుంది. అందువల్ల ఆర్థికంగా మరియు ఇతర విషయాల పరంగా మొత్తం నష్టం జరుగుతుంది. 

అయితే పక్కా ప్లాన్‌ తో ఐఆర్‌సీటీసీ చేస్తున్న టూర్‌ ప్లాన్‌ తో కేవలం మూడు రోజుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి ఇంటికి చేరవచ్చు. ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంతో పాటు తిరుమలలో స్వామి వారి దర్శనం కూడా వారే చేయిస్తారు. కేవలం రూ.4 వేల రూపాయలకే తిరుపతి స్వామివారి దర్శనం కల్పిస్తున్న సమ్మర్ ప్యాకేజీని ఇప్పటికే ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారు. 

ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్‌ ప్యాకేజీ లో భాగంగా ప్రతి రోజు సాయంత్రం లింగంపల్లిలో 5.25 గంటలకు ప్రారంభం అవుతుంది. 6.10 గంటలకు సికింద్రాబాద్ లో, రాత్రి 7.38 కి నల్లొండలో ఆగుతుంది. ఆ రాత్రి అంతా ప్రయాణం ఉంటుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 5.55 గంటలకు రైలు తిరుపతి చేరుకుంటుంది. గోవిందం టూర్ ప్యాకేజీలో భాగంగానే స్టేషన్ నుండి తిరుమలకు ప్రత్యేక బస్సులో తిరుమల తీసుకు వెళ్తారు. 

ఉదయం 9 గంటలకు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనంను కల్పిస్తారు. ఆ తర్వాత తిరుపతికి రావాల్సి ఉంటుంది. హోటల్ లో లంచ్‌ చేయించి తిరుచానూర్‌ లో పద్మావతి అమ్మవారి దర్శనం చేయిస్తారు. అక్కడ నుండి సాయంత్రం తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. తిరుమలలో 6.25 గంటలకు మళ్లీ ట్రైన్‌ ఎక్కాల్సి ఉంటుంది. 

Also Read: Naga Chaitanya: ఆ టాపిక్ గురించి మాట్లాడి టైం వేస్ట్!.. నాగ చైతన్య అలా అన్నాడేంటి?

మరుసటి రోజు తెల్లవారు జామున 3.04 గంటలకు నల్లగొండలో.. 5.35 గంటలకు సికింద్రాబాద్‌ లో ట్రైన్ ఆగుతుంది. అలా మొదటి రోజు సాయంత్రం ప్రయాణం మొదలు పెట్టి రెండవ రోజు మొత్తం తిరుమల తిరుపతి లో దర్శణం చేసుకుని అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం అయ్యి మూడవ రోజు ఉదయం వరకు తిరిగి ఇంట్లో ఉండవచ్చు. ఇంత కచ్చితంగా పర్సనల్ గా వెళ్తే కచ్చితంగా మూడవ రోజు ఉదయం వరకు వచ్చే అవకాశం లేదు. 

కనుక గోవిందం టూర్ ప్యాకేజీ లో వెళ్లిన వారు వెళ్లిన రోజు వచ్చే రోజు కాకుండా మధ్య లో ఒక్క రోజు లోనే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వచ్చే అవకాశం ఉంది. కనుక ఐఆర్‌సీటీసీ యొక్క గోవిందం టూర్ ప్యాకేజీకి మంచి డిమాండ్ ఉంది. నాలుగు వేల రూపాయల్లో ఈ అద్భుతమైన సమ్మర్ ట్రిప్ ను ఎంజాయ్ చేయవచ్చు. 

Also Read: Drugs Supplying to Students: విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్ సరఫరా.. ముఠా అరెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News