FY vs AY: ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అంటే ఏమిటి, రెండింటీ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా

FY vs AY: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన సమయం. మరో 15 రోజులే గడువు మిగిలింది. ఈ క్రమంలో ఐటీ రిటర్న్స్‌కు సంబంధించి చాలామందికి చాలా సందేహాలుంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ వర్సెస్ అసెస్‌‌మెంట్ ఇయర్ విషయంలో కన్ఫ్యూజన్ వస్తుంటుంది. ఈ సందేహాలు తీర్చే ప్రయత్నం చేద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 15, 2023, 07:49 PM IST
FY vs AY: ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అంటే ఏమిటి, రెండింటీ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా

FY vs AY: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ విషయంలో కొన్ని విషయాలపై సందేహాలుంటున్నాయి. ఐటీ రిటర్న్స్ , ఐటీ రిఫండ్ విషయం పక్కనబెడితే ఏది ఫైనాన్షియల్ ఇయర్, ఏది అసెస్‌మెంట్ ఇయర్ అనే విషయంలో తికమకపడుతుంటారు. ట్యాక్స్ ప్రాక్టీషనర్లు చెప్పినంత సులభంగా ట్యాక్స్ పేయర్లకు ఈ విషయం అర్ధం కాదు.

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు మరో 15 రోజులు గడువుంది. ట్యాక్స్ పేయర్లతో ట్యాక్స్ ప్రాక్టీషనర్లు చాలా బిజీగా ఉండే సమయం. ఈ క్రమంలో మీరు తరచూ వినే అంశాలు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్. ఈ రెండూ పైకి చెప్పినంత సులభంగా అర్ధం కావు. చాలామందికి అర్ధం కాదు కూడా. రెండింటి మధ్య తేడా తెలుసుకోలేక తికమక పడుతుంటారు. ఫైనాన్షియల్ ఇయర్‌ను FYగా, అసెస్‌మెంట్ ఇయర్‌ను AYగా అభివర్ణిస్తుంటారు. ఇక్కడే తికమకపడుతుంటారు. ఆ తికమకను దూరం చేసే ప్రయత్నం చేద్దాం..

ఆర్ధిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై మార్చ్ 31 వరకూ ఉంటుంది. అంటే 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చ్ 2024 వరకూ ఉండే వ్యవధిని ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 గా పిలుస్తారు. ఏడాది మొత్తం కాలంలో మీరు సంపాదించేదానికి ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ను కూడా ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అడ్వాన్స్ ట్యాక్స్ , టీడీఎస్ ఫైనాన్షియల్ ఇయర్‌లోనే చెల్లిస్తారు. ఈ రెండు ట్యాక్స్‌లు మీ ఉజ్జాయింపు ఆదాయం ఆధారంగా లెక్కించి చెల్లిస్తుంటారు. ఈ నేపధ్యంలో అసలు ఆదాయం కంటే తక్కువ లేదా ఎక్కువ కూడా ఉండవచ్చు. ట్యాక్స్ అసలు చెల్లింపు అనేది అసెస్‌మెంట్ ఇయర్‌లోనే తెలుస్తుంది.

ఇక ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తరువాత అసెస్‌మెంట్ ఇయర్ ప్రారంభమౌతుంది. ఆ సంవత్సరం ఆర్ధిక సంవత్సరం ఆదాయంపై ట్యాక్స్ అసెస్ చేసినప్పుడని అర్ధం. 2022-23 ఫైనాన్శియల్ ఇయర్ 1 ఏప్రిల్ 2022 నుంచి 31 మార్చ్ 2023 వరకూ ఉంటుంది. దీనికోసం అసెస్‌మెంట్ అనేది 1 ఏప్రిల్ 2023 నుంచి ప్రారంభమౌతుంది.

గత ఆర్ధిక సంవత్సరం మొత్తం సంపాదనపై ఎంత ట్యాక్స్ చెల్లించారనేది ఈ అసెస్‌మెంట్ ఇయర్‌లో నిర్ణయమౌతుంది. ఆ ప్రకారం ఇన్‌కంటాక్స్ రిటర్న్ దాఖలు చేస్తారు. అంటే జూలై 31 2023లో ఆర్ధిక సంవత్సరం 2022-23 ఆదాయంయపై ఐటీఆర్ దాఖలు చేస్తారు. నిబంధనల ప్రకారం ఆర్ధిక సంవత్సరం పూర్తయిన ఏడాదిలోగా ఇన్‌కంటాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అసెస్‌మెంట్ ఇయర్ కోసం ట్యాక్స్ నిబంధనలు, ట్యాక్స్ స్లాబ్ రేటు ఆర్ధిక సంవత్సరంలో ఉన్నట్టే ఉంటుంది.

Also read: BMW X5 Facelift: ఇండియాలో ఎంట్రీ ఇచ్చే,సిన బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ఫేస్‌లిఫ్ట్, ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News