IT Returns Updates: ఐటీ రిటర్న్స్ లేదా ఇ వెరిఫై జూలై 31 తరువాత చేయవచ్చా, ఎలా చేయాలి, పెనాల్టీ ఎంత

IT Returns Updates: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్్ గడువు తేదీ ముగిసింది. జూలై 31 ఇవాళ చివరి రోజు కావడంతో పెద్దఎత్తున రిటర్న్స్ దాఖలయ్యాయి. ఇవాళ మిస్ అయినవారి పరిస్థితి ఏంటి, రేపు కూడా ఫైల్ చేయవచ్చా లేదా ..పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2023, 11:28 PM IST
IT Returns Updates: ఐటీ రిటర్న్స్ లేదా ఇ వెరిఫై జూలై 31 తరువాత చేయవచ్చా, ఎలా చేయాలి, పెనాల్టీ ఎంత

IT Returns Updates: ఇన్‌కంటాక్స్ శాఖ పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది. మెస్సేజ్‌లు, మెయిల్స్ రూపంలో, వివిధ పత్రికల్లో, టీవీల్లో ప్రకటనల రూపంలో అప్రమత్తం చేస్తూ వచ్చింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇవాళ జూలై 31 చివరి తేదీ కాస్తా అయిపోయింది. మరిప్పుడు ఏం చేయాలి, రిటర్న్స్ మిస్స్ అయినవాళ్లు, ఇ వెరిఫై కానివాళ్ల సంగతేంటి...

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 అంటే ఇవాళ చివరి రోజు. గడువు తేదీ పొడిగింపు ఉండదని, లాస్ట్ మినిట్ రష్ తప్పించేందుకు త్వరగా రిటర్న్స్ దాఖలు చేయాలని ఐటీ శాఖ పదే పదే ట్యాక్స్ పేయర్లను అప్రమత్తం చేస్తూ వచ్చింది. అయినా కొంతమంది మిస్ అయిపోయారు. ఇవాళ అంటే జూలై 31 మధ్యాహ్నం వరకూ చివరి రోజున 11.03 లక్షలమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. మొత్తం 6.24 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. చివరి గంటలో 3.39 లక్షల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడమే కాదు..ఇ వెరిఫికేషన్ జరిగితేనే ఆ ప్రక్రియ పూర్తయినట్టు అర్ధం. చివరి నిమిషం కావడంతో చాలామందివి ఇ వెరిఫై కాకుండా ఆగిపోతుంటాయి. అదే విధంగా మొత్తం 6.24 కోట్ల రిటర్న్స్‌లో 5.3 కోట్ల ఐటీఆర్‌లు వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నాయి. 

ఇ వెరిఫికేషన్ జూలై 31 తరువాత కూడా చేయవచ్చని ఇన్‌కంటాక్స్ శాఖ చెబుతోంది. అయితే రిటర్న్స్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా ఇ వెరిఫై ప్రక్రియ పూర్తి చేయకపోతే రిటర్న్స్ ఇన్‌వాలిడ్ అవుతాయి. జూలై 31 లోగా రిటర్న్స్ దాఖలు చేయకపోతే డిసెంబర్ 31 లోగా జరిమానాతో చెల్లించాల్సి వస్తుంది. ఈ జరిమానా అనేది ఆదాయాన్ని బట్టి ఉంటుంది. వార్షిక ఆదాయం 5 లక్షలు దాటితే 5 వేల జరిమానా ఉంటుంది. అదే 5 లక్షల్లోపు ఆదాయం ఉంటే 1000 రూపాయల జరిమానా చెల్లించాలి. 2023 డిసెంబర్ 31 తరువాత అయితే ఈ జరిమానా 10 వేలకు చేరుకుంటుంది.

ఇ వెరిఫై ఎలా చేయాలి

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలును ఇ వెరిఫై చేసేందుకు ఆధార్ మొదటి మార్గం. ఆదార్ కార్డు రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారరా నిర్దారించాల్సి ఉంటుంది. ఇక రెండవది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు. ఇక్కడ కూడా మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఈ రెండు మార్గాలు కాకుండా డీమ్యాట్ ఎక్కౌంట్ ఉంటే ఆ ఖాతా ద్వారా, ఏటీఎం కార్డు ద్వారా , బ్యాంక్ ఎక్కౌంట్ ద్వారా కూడా ఇ వెరిపికేషన్ పూర్తి చేయవచ్చు. అంటే ఇ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు మొత్తం ఐదు పద్ధతులున్నాయి. 

నెట్ బ్యాంకింగ్ విధానంలో నెట్ బ్యాంకింగ్ పేజ్ లాగిన్ అయ్యాక మీ వివరాలు నమోదు చేయాలి. రిటర్న్స్ ధృవీకరించే ఎంపికను ఎంచుకుంటే నేరుగా ఇ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో ఐటీఆర్ ఫామ్‌లోని వెరిపై క్లిక్ చేస్తే చాలు. డీమ్యాట్, ఏటీఎం, బ్యాంక్  ఎక్కౌంట్ విధానంలో అయితే ఈవీసీ కోడ్ ద్వారా నిర్దారణ చేయాలి. 

Also read: JioBook Loptop: రిలయన్స్ జియో నుంచి మరో సెన్సేషన్, అతి తక్కువ ధరకే జియో బుక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News