Jio Star OTT: జియో సినిమా, హాట్‌స్టార్ విలీనం పూర్తి, జియో స్టార్ ఎప్పట్నించో తెలుసా

Jio Star OTT: ఓటీటీ మార్కెట్‌లో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీల విలీనం దాదాపుగా పూర్తయింది. ఎల్లుండి నుంచి అంటే నవంబర్ 14 నుంచి జియో స్టార్ పేరుతో ఓటీటీ మార్కెట్‌లో ఎంట్రీ  ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 12, 2024, 02:28 PM IST
Jio Star OTT: జియో సినిమా, హాట్‌స్టార్ విలీనం పూర్తి, జియో స్టార్ ఎప్పట్నించో తెలుసా

Jio Star OTT: ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తరువాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాటా ఎక్కువ. ఒక్కోసారి ఈ మూడూ పోటీ పడుతుంటాయి. జియో సినిమా కూడా ఓటీటీగా అందుబాటులో ఉంది. 

రానున్న రోజుల్లో జియో స్టార్ పేరుతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు పోటీ ఎదురుకానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా రెండూ విలీనమై జియో స్టార్ పేరుతో ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో ఈ రెండింటి విలీన ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 13 అంటే రేపటికి పూర్తి కానుంది. నవంబర్ 14 నుంచి కొత్త ఓటీటీ జియో స్టార్ రూపంలో అందుబాటులో రానుంది.  ప్రస్తుతం జియో సినిమాకు ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు 500 మిలియన్ల డౌన్‌లోడ్స్ ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీతో పాటు పలు టీవీ ఛానెళ్లను స్టార్ ఇండియా కలిగి ఉంటే..జియో సినిమా ఓటీటీతో పాటు పలు టీవీ ఛానెళ్లను రిలయన్స్ సంస్థకు చెందిన వయాకాం కలిగి ఉంది. ప్రస్తుతం రెండింటి విలీనం దాదాపుగా పూర్తయింది. నవంబర్ 14 నుంచి అందుబాటులో రానుంది.

జియో సినిమా, హాట్‌స్టార్ విలీనం ప్రకటన రాగానే ఢిల్లీకు చెందిన ఓ యాప్ డెవలపర్ జియో హాట్‌స్టార్ డొమైన్ తన పేరుతో రిజిస్టర్ చేశాడు. కోటి రూపాయలిస్తే డొమైన్ ఇస్తానని చెప్పినా జియో స్పందించలేదు. ఆ తరువాత దుబాయ్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు ఈ డొమైన్ కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరూ రిలయన్స్ సంస్థకు ఉచితంగా ఇస్తానని ఆఫర్ చేసినా జియో స్పందించలేదు. 

నవంబర్ 14 నుంచి అందుబాటులో రానున్న జియో స్టార్ కంటెంట్, టారిఫ్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే జియో సినిమా ప్రస్తుతం ఉచితంగా అందుతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మాత్రం వేర్వేరు టారిఫ్ రేట్లలో ఉంది. ఇప్పుడీ రెండూ విలీనం కావడంతో టారిఫ్ రేట్లు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. 

Also read: Pension New Rules: కేంద్రం గుడ్ న్యూస్, సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు అదనపు పెన్షన్, ఎవరికెంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News