Layoffs 2023: మరో దిగ్గజ కంపెనీ లేఆఫ్ ప్రకటన.. ఆందోళనలో ఉద్యోగులు

SAP Labs Layoffs: అదనపు భారాన్ని తగ్గించేందుకు ఐటీ కంపెనీలు లేఆఫ్‌ల బాట పడుతున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులను తొలగింపు ప్రక్రియ చేపడుతున్నాయి. ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. తాజాగా మరో కంపెనీ కూడా 300 మంది ఉద్యోగులను తొలగించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 05:38 PM IST
Layoffs 2023: మరో దిగ్గజ కంపెనీ లేఆఫ్ ప్రకటన.. ఆందోళనలో ఉద్యోగులు

SAP Labs Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతోంది. వరుసగా దిగ్గజ కంపెనీలు లే ఆఫ్‌లు ప్రకటిస్తుండడంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడిపోతుందోనని భయపడుతున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు ఇటీవల భారీగా ఉద్యోగాలును ఇళ్లకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో కంపెనీ చేరింది. జర్మన్ టెక్నాలజీ సంస్థ ఎస్ఏపీ ల్యాబ్స్ భారత్‌లోని కేంద్రాల నుంచి ఉద్యోగులను తొలగించింది. బెంగళూరు, గురుగ్రామ్ కార్యాలయాల నుంచి ఉద్యోగులను తొలగించారు. ప్రపంచస్థాయిలో కేంద్రాలను మూసివేస్తుండంతో ఉద్యోగుల తొలగింపు అనివార్యమైంది. 

ఎస్‌ఏపీ ల్యాబ్స్‌లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల జీతంలో కూడా కోతలు విధించారు. ఇందులో 10 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులు ఉన్నారని.. రిట్రెంచ్‌మెంట్‌కు బదులుగా జీతం ప్యాకేజీని తగ్గించారు. రిట్రెంచ్‌మెంట్‌పై కంపెనీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అయితే కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా సరైన ప్రణాళికతో పనిచేస్తూ.. లాభాలపై పనిచేస్తోందన్నారు. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 

దాదాపు 3 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించి కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా తన ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు గత నెలాఖరులో తొలగింపులను ప్రకటించింది. డిసెంబర్ 2022తో ముగిసిన నాల్గో త్రైమాసికంలో ఆదాయం 30 శాతం పెరిగింది. అదే సమయంలో 2025 నాటికి భారత్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, పూణే, గురుగ్రామ్, బెంగళూరులో 14 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 

ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు 2 నెలల నోటీసు జారీ చేసినట్లు కూడా కంపెనీ తన నివేదికలో పేర్కొంది. 2 నెలల తరువాత ఉద్యోగులు జీతం చెల్లించి తొలగించింది. కంపెనీలో 19 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారని ఒక నివేదికలో పేర్కొంది. 300 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. 

Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం

Also Read: Minister Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు కుటుంబంలో తీవ్ర విషాదం    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News