Anil Ambani Adag Group: అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చాయా.. అడాగ్ గ్రూప్‌లోని ఈ షేర్లు భారీగా పెరిగాయి.. కారణాలు ఇవే

Anil Ambani Company Shares: అనిల్ అంబానీ గ్రూపులోని రిలయన్స్ పవర్ షేర్లు నేడు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. దీంతో కంపెనీ షేర్లకు ఊపు వచ్చి మార్కెట్ క్యాపిటల్ పెరిగింది. దీనికి దారి తీసినకారణాలేంటో తెలుసుకుందాం.

Written by - Bhoomi | Last Updated : Aug 21, 2024, 08:01 PM IST
 Anil Ambani Adag Group: అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చాయా.. అడాగ్ గ్రూప్‌లోని ఈ షేర్లు భారీగా పెరిగాయి.. కారణాలు ఇవే

Anil Ambani : ఒకప్పటి అపరకుబేరుడు ప్రస్తుత ఆసియాలోనే  నెంబర్ వన్ సంపన్నుడు  ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి  మంచి రోజులు వస్తున్నాయా అంటే నిజమే అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పీకల్లోతు కష్టాలతో అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ, ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటకు వస్తున్నారు. ఆయన కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా ఆయన కంపెనీ రిలయన్స్ పవర్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ తాకాయి.  

బుధవారం, కంపెనీ షేర్లు 5% పెరిగి రూ.36.17కి చేరాయి, ఇది 52 వారాల గరిష్ట స్థాయి కావడం విశేషం. గత మూడు రోజుల్లో దీని షేర్లు 15 శాతం లాభపడ్డాయి. గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ నాగ్‌పూర్‌లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కొనుగోలు చేయడానికి చర్చలు ప్రారంభించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ప్లాంట్ రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ అయిన విదర్భ పవర్ ఇండస్ట్రీస్‌లో భాగంగా ఉంది. అప్పటి నుంచి రిలయన్స్ పవర్ షేర్లలో భారీ పెరుగుదల కనిపిస్తోంది.

Also Read : Ambani-Adani: అంబానీ పవర్‎..అదానీ చేతుల్లోకి..ఏకంగా వేల కోట్లకు డీల్

ఈ పెరుగుదలతో రిలయన్స్ పవర్ మార్కెట్ క్యాప్ రూ.14,529 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ పవర్ IPO జనవరి 2008లో వచ్చింది. అప్పట్లో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11,563 కోట్లు. అప్పట్లో కంపెనీ ఇష్యూ ధర రూ. 405–450 మధ్యలో ఉంది. దీనికి 70 రెట్లు బిడ్లు వచ్చాయి. లిస్టింగ్ రోజున 21% ప్రీమియంతో రూ.547.80కి చేరింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లను రిలయన్స్ పవర్ నిరాశపరిచింది. మార్చి 27, 2020న దీని ధర రూ.1.13కి పడిపోయింది. అయితే, గడిచిన నాలుగేళ్లలో రిలయన్స్ పవర్ షేర్లలో మంచి రికవరీ కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో రిలయన్స్ పవర్ షేర్లు 115 శాతం పెరిగింది. 

ముఖేష్ అంబానీ vs అనిల్ అంబానీ:

ముఖేష్ అంబానీ సోదరుడు అయిన అనిల్ అంబానీ ఒకప్పుడు దేశంలోనే అత్యంత సంపన్నులలో ఒకరు. 2007లో ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన నివేదిక ప్రకారం అనిల్ అంబానీ నికర విలువ 45 బిలియన్ డాలర్లు. అప్పట్లో దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. కానీ నేడు అతని విలువ చాలా పడిపోయింది. మరోవైపు ఆయన సోదరుడు   ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 113 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముఖేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది అతని నికర విలువ 16.4 బిలియన్ డాలర్లు పెరిగింది.

Also Read : Nita Ambani Gift: నీతా అంబానీకి చిన్న కోడలు అంటేనే ఇష్టమా..పెద్ద కోడలు కన్నా చిన్నకోడలికే.. అత్యంత ఖరీదైన గిఫ్ట్  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News