Cheapest Insurance Policy: నేటి కాలంలో బీమా ప్రాముఖ్యత అనేది చాలా పెరిగింది. జీవిత బీమా కోసం ప్రజలు వేలాది రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నారు. అయితే ఐఆర్సిటిసి కేవలం 45 పైసలకే 10 లక్షల రూపాయల బీమాను అందజేస్తుందని మీకు తెలుసా? ఇది భారతదేశంలోని అత్యంత చౌకైన బీమా. ఐఆర్సిటిసి ఈ ప్రత్యేక బీమా ప్లాన్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఐ ఆర్ సి టి సి అందించే ఈ పది లక్షల రూపాయల బీమా కవరేజ్ ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ స్కీం కింద కన్ఫర్మ్ అయిన ఆర్ఎసి తాత్కాల్ టికెట్లపై మాత్రమే భీమా రక్షణ అందుబాటులో ఉంటుంది. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ సదుపాయాన్ని పొందలేరు. అయితే ఈ సదుపాయం ఐదేళ్ల నుండి 11 సంవత్సరాల మధ్య పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఐఆర్సిటిసి ఈ బీమా ప్లాన్ కింద ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు:
రైలు ప్రమాదంలో మరణిస్తే పది లక్షల రూపాయలు, శాశ్వత వైకల్యం ఉంటే పది లక్షల రూపాయలు, శాశ్వత పాక్షిక వైకల్యం ఉంటే 7.5 లక్షలు, గాయాలు అయితే ఆసుపత్రి ఖర్చుల కోసం రెండు లక్షల రూపాయలు, మృతదేహాన్ని తరలించేందుకు పదివేల రూపాయలు ఐఆర్సిటిసి ప్రకారం బీమాకు సంబంధించిన ఏదైనా ప్లైన్ లేదా బాధ్యత పాలసీదారు బీమా కంపెనీ మధ్య ఉంటుంది.
Also Read: EPFO: పెన్షన్ దారులకు గుడ్‌న్యూస్..ఇక నుంచి దేశంలో ఎక్కడైనా, ఏ బ్యాంకు నుంచైనా పింఛన్ తీసుకోవచ్చు.
ఈ బీమా సౌకర్యం పూర్తిగా ఐచ్చికం. మీకు కావాలంటే మాత్రమే ఈ బీమాను తీసుకోవచ్చు. కానీ కేవలం 45 పైసలకే 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం పొందడం చాలా ప్రయోజనకరం. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందని దృష్టిలో ఉంచుకొని ఈ బీమా తీసుకోవాలి. దేశంలో ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. చాలామంది ప్రయాణికుల్లో రైళ్లలో వందల వేలకు కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఐఆర్సిటిసి అందించిన ఈ సదుపాయాన్ని పొందడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఐఆర్సిటిసి వెబ్సైట్లో, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసేటప్పుడు మీరు ఈ బీమా ఆప్షన్ పొందుతారు. దీని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు కేవలం 45 పైసలకే ఈ బీమా రక్షణ పొందవచ్చును. ఇది రైల్లో ప్రయాణించే వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
Also Read: Gold Rate Today: కొత్త సంవత్సరం వేళ..తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలిస్తే కొనేస్తారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter