MP Govt On LPG Gas Prices: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇటీవల రాఖీ పర్వదినం సందర్భంగా గ్యాస్ ధరలు భారీగా తగ్గించింది. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గిస్తే.. వాహనదారులకు ఊరట కలగనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను ఆకర్షించేందుకు సరికొత్త స్కీమ్స్ పరిచయం చేస్తునే.. ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు ఉజ్వల యోజన, లాడ్లీ బ్రాహ్మణ యోజన స్కీమ్ కింద ఎల్‌పీజీ సిలిండర్లను కేవలం 450 రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది.
గ్యాస్ సిలిండర్‌కు మిగిలిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించింది. సబ్సిడీ పొందేందుకు గ్యాస్ వినియోగదారులు మార్కెట్ ధరకు గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాలని.. తరువాత సబ్సిడీ మొత్తం గ్యాస్ కనెక్షన్ హోల్డర్ల బ్యాంక్ అకౌంట్‌కు ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేస్తుందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ రేటులో ఏదైనా తగ్గింపు ఉంటే వినియోగదారుల బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తుంది.
అయితే భవిష్యత్‌లో గ్యాస్ ధరల్లో ఏదైనా హెచ్చుతగ్గులు ఉంటే.. అప్పుడు రాష్ట్ర సబ్సిడీని ఆ రేట్లకు తగినట్లు సర్దుబాటు చేస్తారు. ప్రధాని మోదీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పర్యటనకు ఒక రోజు ముందు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రాయితీ ప్రకటన వెలవడటం విశేషం. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్న లాడ్లీ బ్రాహ్మణులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో కొందరు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు కూడా ఉన్నారు. లాడ్లీ బ్రాహ్మణ యోజన కోసం దరఖాస్తు ప్రక్రియ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేవారు కనెక్షన్ వినియోగదారు సంఖ్య, ఎల్‌పీజీ కనెక్షన్ ఐడీ ఇవ్వాలని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడానికి అన్ని ఆయిల్ కంపెనీల నుంచి పొందిన డేటా ఆధారంగా లాడ్లీ బ్రాహ్మణ స్కీమ్ కోసం రిజిస్ట్రేషన్ ఐడీని అందజేస్తారు. లబ్దిదారుల జాబితా ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారులు తమ గ్యాస్ వినియోగదారు నంబర్ లేదా గ్యాస్ కనెక్షన్ ఐడీ, లాడ్లీ బ్రాహ్మణ ఐడీని ఉపయోగించి తమ పేరు చెక్ చేసుకోవచ్చని సూచించారు.
Also Read: Samsung Galaxy A14 5G Price: రూ.7,399కే Samsung Galaxy A14 మొబైల్..వినాయక చవితి స్పెషల్ ఆఫర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook