LPG Price Today: ఎల్పిజి గ్యాస్ ధరను 2021 ఫిబ్రవరి 1న మార్చకుండా వదిలేసిన ప్రభుత్వం తాజాగా సబ్సిడీ లేని LPG cylinders పై ధరను రూ .25 మేర పెంచాలని నిర్ణయించుకుంది. కొత్తగా పెంచిన రేట్లు ఈ రోజు నుండే.. అంటే 2021 ఫిబ్రవరి 4 నుండే అమలులోకి వచ్చాయన్న మాట. ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు ( LPG price hike ) అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .664 కు బదులుగా రూ .719 చెల్లించాల్సి ఉంటుంది. లక్నోలో ఎల్పిజి ధర రూ .732 నుండి రూ .757 కి పెరిగింది. LPG price in Noida ధర రూ .692 కు బదులుగా రూ .717 అవుతుంది. 19 కిలోల Commercial LPG cylinders price ను ప్రభుత్వం రూ .1349 నుంచి రూ .1533 కు పెంచింది. అంటే ఒక్కో కమెర్షియల్ సిలిండర్ ధరకి రూ .184 మేర పెరిగిందన్న మాట.
LPG price in Hyderabad: హైదరాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ ధరలు :
ఎల్పిజి సిలిండర్ల ధరల పెరుగుదల అనంతరం హైదరాబాద్‌లో నిన్నటి వరకు రూ.746.50 గా ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధరల నేటి నుంచి రూ .771.50 కి పెరిగింది.
LPG price in other metros:
LPG prices in Delhi రూ .719 గా ఉండగా, కోల్‌కతాలో ఎల్పిజి ధర ఇప్పుడు రూ .745.50 గా, ముంబైలో ఎల్పిజి సిలిండర్ ధర రూ .719 గా మారగా, చెన్నైలో ఎల్పిజి గ్యాస్ ధర ప్రస్తుతం సిలిండర్‌కు రూ .735 గా మారింది. బెంగళూరులో ఎల్పిజి ధర 722 రూపాయలుగా, చండీఘడ్‌లో ఎల్పిజి ధర 728.50 రూపాయలుగా ఉంది.
Also read : Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి
ర్గావ్లో ఎల్పిజి ధర 728 రూపాయలు కాగా, జైపూర్‌లో ఎల్పిజి గ్యాస్ ధర 723 రూపాయలుగా ఉంది. బిహార్ రాజధాని పాట్నాలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ .792.50 కి చేరింది.
2020 డిసెంబర్లో, చమురు కంపెనీలు రెండుసార్లు ఎల్పిజి ధరలను ( LPG prices ) పెంచాయి. జనవరి 2021 లో ఎల్పిజి ధరలను సవరించలేదు కనుక ఫిబ్రవరి 2021 లో చమురు కంపెనీలు ఎల్పిజి ధరలను పెంచుతాయని ఊహించినట్టుగానే నేడు ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి.
Also read : LPG cylinders prices to change weekly: LPG cylinders ధరలు ఇక వారానికి ఓసారి మార్పు ?
భారత్‌లో ఎల్పిజి ధరలను ప్రభుత్వరంగ చమురు సంస్థలైన IOCL లాంటి Oil companies నిర్ణయిస్తాయి. నెలవారీగా ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ప్రస్తుత మార్కెట్ దృష్ట్యా పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని భరించవలసి ఉన్నందున ఎల్పిజి ధరలను పెంచక తప్పడం లేదని IOCL, BPCL, HPCL చెబుతున్నాయి. ఇందులో కొంతమేరకు relief ఇచ్చే అంశం ఏంటంటే... ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలపై భారత ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ ( Subsidy on domestic LPG cylinders prices ) అందిస్తోంది. సిలిండర్ కొనుగోలు చేసిన తరువాత సబ్సిడీ మొత్తం నేరుగా వ్యక్తుల బ్యాంక్ ఖాతాకు ( LPG subsidy in bank accounts ) జమ అవుతుంది.
సబ్సిడీ మొత్తం ప్రతి నెలా మారుతూ ఉంటుంది. Dollar value తో పాటు సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్ ఎల్పిజి ధరలలో మార్పుల ఆధారంగా కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలు సవరిస్తుంటాయనే సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook