Mahindra XUV400: నేడే మహీంద్రా SUV XUV400 ఫ్రీ బుకింగ్ ప్రారంభం.. ఇక ఆ EV వెహికల్ పని అయిపోయినట్లేనా?

Mahindra XUV400 Bookings Open: మహీంద్రా తన కొత్త ఈవీ వెహికల్స్‌పై ఫ్రీ బుకింగ్‌ కూడా ఇప్పటికే స్టార్ట్‌ చేసింది. అయితే మీరు ఈ కారు ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న మహీంద్రా షో రూం కీ వెళ్లి..  రూ.21000 చెల్లించి ఫ్రీ బుకింగ్‌ చేసుకొవచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 12:04 PM IST
Mahindra XUV400: నేడే మహీంద్రా SUV XUV400  ఫ్రీ బుకింగ్ ప్రారంభం.. ఇక ఆ EV వెహికల్ పని అయిపోయినట్లేనా?

Mahindra XUV400 Bookings Open: మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ SUV XUV400 (Mahindra XUV400) ఫ్రీ బుకింగ్ ప్రారంభించింది. అయితే ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే  మీ దగ్గరలో ఉన్న మహీంద్రా షో రూంకి వెళ్లి.. ఇప్పుడే రూ.21000 చెల్లించి ఫ్రీ బుకింగ్‌ చేసుకొవచ్చు. అయితే ఈ కారు ఇటీవలే లాంచ్‌ అయిన  టాటా నెక్సాన్ EVతో పోటిపడనుంది. అయితే  నెక్సాన్ EV మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు అందరికీ తెలిసిందే.. అయితే దీని కంటే తక్కువ ధరలో ఈ మహీంద్రా SUV XUV400 EV వెహికల్ తీసుకు రావడం విశేషం. అయితే ఇప్పుడుఈ కారును ఇప్పుడు బుకింగ్‌ చేసుకుంటే మార్చి మొదటి వారంలో డెలివరీలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ మహీంద్రా SUV XUV400 ధర రూ. 15.99 లక్షల నుంచి మొదలై రూ.18.99 లక్షల వరకు ఉండనుంది.

మహీంద్రా XUV400 ధరలు:

మహీంద్రా XUV400 EC (3.3 kW ఛార్జర్ సెట్‌అప్‌  సఫోర్ట్‌ కలిగిన వెహికల్‌) - రూ. 15.99 లక్షలు

మహీంద్రా XUV400 EC (7.2 kW ఛార్జర్ సెట్‌అప్‌  కలిగిన వెహికల్‌) - రూ. 16.49 లక్షలు

మహీంద్రా XUV400 EL (7.2 kW ఛార్జర్ సెట్‌అప్‌ కలిగిన వెహికల్‌) - రూ. 18. 9 లక్షలు

ఈ ధరలు మొదటి 5,000 యూనిట్లకు మాత్రమే. కొత్త మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంది. దీని EC కూడిన 34.5kWh, EL వేరియంట్స్‌ 39.4kWh బ్యాటరీ ప్యాక్‌ అప్‌తో మార్కెట్‌లోకి రానుంది. బ్యాటరీ ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తినిస్తుంది. ఇది 150bhp శక్తితో పాటు.. 310Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. XUV400 EV దాని కేటగిరీలో అత్యంత వేగవంతమైన మోడల్‌గా చెప్పొచ్చు. మహీంద్రా XUV400 గరిష్ట వేగం 150 kmph అయితే.. ఇది కేవలం 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.

34.5kWh బ్యాటరీ ప్యాక్‌తో.. ఒక సారి ఫుల్ ఛార్జింగ్‌ చేస్తే దాదాపు 375 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని సమాచారం. అయితే ఇది పెద్ద బ్యాటరీ సెట్‌అప్‌తో ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో ఒక్క సారి ఛార్జ్ చేస్తే దాదాపు 456 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను కూడా అందించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఈ ఎలక్ట్రిక్ SUV మూడు డ్రైవింగ్ మోడ్‌(ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్) లభిస్తోంది. 50kWh DC ఫాస్ట్ ఛార్జర్ సఫోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల మీరు ఒక్క సారి ఛార్జింగ్‌ చేస్తే.. 50 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో బ్యాటరీ ఫుల్‌గా నిండుతుంది.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News