Multibagger Stocks: 50 పైసల షేర్ ధమాకా, 50 వేల రూపాయల షేర్లు 33 లక్షలైన వైనం

Multibagger Stocks: షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కొన్ని కంపెనీ షేర్లు ఒక్కసారిగా లాభాలు కురిపిస్తే మరికొన్ని కంపెనీల షేర్లు నషాల్లో పడిపోతాయి. ఇంకొన్ని షేర్లు తక్కువ కాలంలోనే ఎక్కువ రిటర్న్స్ అందిస్తాయి. అలాంటి షేర్ గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 9, 2023, 08:16 PM IST
Multibagger Stocks: 50 పైసల షేర్ ధమాకా, 50 వేల రూపాయల షేర్లు 33 లక్షలైన వైనం

Multibagger Stocks: షేర్ మార్కెట్‌లో కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు అద్బుతమైన లాభాల్ని ఆర్జించిపెడుతుంటాయి. కొన్ని షేర్లు దీర్ఘకాలంలో లాభాలు అందిస్తే, కొన్ని మాత్రం షార్ట్ పీరియడ్‌లో ఊహించని లాభాలు అందిస్తుంటాయి. తక్కువ కాలంలో లేదా ఎక్కువ కాలంలో అధిక లాభాలు ఆర్జించే షేర్లను మల్టీబ్యాగర్ షేర్లంటారు. ఆ వివరాలు మీ కోసం..

షేర్ మార్కెట్‌లో ఓ షేర్ అద్బుతమైన లాభాల్ని ఆర్జించి పెట్టింది ఇన్వెస్టర్లకు. ఆ కంపెనీ పేరు ట్రైడెంట్ లిమిటెడ్. దీర్ఘకాలంలో ఈ కంపెనీ ఇన్వెస్టర్లు ఊహించనంత లాభాల్ని ఇచ్చింది. ఓ సమయంలో ఒక్కొక్క షేర్ 1 రూపాయి ఉంటే ఇప్పుడు అదే కంపెనీ షేర్ 30 రూపాయలైంది. నెమ్మదిగా పెరిగినా భారీగా పెరిగింది.షేర్ మార్కెట్‌లో ఈ తరహా షేర్లు చాలా ఉంటాయి. దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలిచ్చేవి, షార్ట్ పీరియడ్‌లో అధిక రిటర్న్స్ అందించేవి ఉంటాయి. ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ కూడా దీర్ఘకాలంలో అధిక లాభాల్ని ఆర్జించింది. ట్రైడెంట్ లిమిటెడ్ కంపెనీ షేర్ అదే విధంగా లాభాలు సంపాదించిపెట్టింది. ఓ సమయంలో 1 రూపాయ కంటే తక్కువే ఉన్న షేర్ ధర ఇప్పుడు ఏకంగా 30 రూపాయలకు చేరుకుంది. 

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో జూన్ 6వ తేదీ 2001లో ట్రైడెంట్ షేర్ ధర కేవలం 50 పైసలు. నమ్మలేకున్నారు కదా. కానీ నిజం. ఆ తరువాత క్రమంగా ఈ షేర్ క్రమంగా పెరుగుతూ పోయింది. జనవరి 2022లో తొలిసారి ఈ షేర్ ధర 64 రూపాయలకు సైతం చేరింది. ఇదే ఆ కంపెనీకు ఆల్ టైమ్ గరిష్ట ధర. ఆ తరువాత తిరిగి తగ్గుతూ పోయింది. ప్రస్తుతం అంటే జూలై 7 నాటికి ఎన్ఎస్ఈలో ట్రైడెంట్ క్లోజింగ్ ధర 33.70 రూపాయలుంది. అంటే ట్రైడెంట్ కంపెనీ షేర్ 50  పైసలున్నప్పుడు 50 వేలు పెట్టుబడి పెట్టుంటే..1 లక్ష షేర్లు లభించేవి. ఇప్పుడు 22 ఏళ్ల తరువాత 1 లక్ష షేర్ల విలువ 33 లక్షలైపోయింది. 2001 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 6640 శాతం రిటర్న్ అందించినట్టే.

ఇదే విధంగా షార్ట్ పీరియడ్‌లో కూడా ఊహించని విధంగా పెరిగి అదిక లాభాల్ని ఇచ్చే మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉంటాయి. సరైన సమయంలో సరైన కంపెనీ షేర్‌లను గుర్తించి పెట్టుబడి పెడితే లాభాలు ఆర్జించడం సులభమే. కానీ దీనికోస నిశిత పరిశీలన, నిరంతర అద్యయనం అవసరం. మార్కెట్‌లో ఏ వస్తువులకు డిమాండ్ అధికంగా ఉందో తెలుసుకుని వాటికి సంబంధించిన షేర్లలో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ ఉంటాయి.

Also read: Mahindra 6 Seater Car: మహీంద్రా నుంచి త్వరలో సరికొత్త 6 సీటర్ ఎస్‌యూవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News