Mutual Funds: స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉన్నవాళ్లు ముందుగా చూసేది మ్యూచ్యువల్ ఫండ్స్ వైపే. ఇటీవలి కాలంలో మ్యూచ్యువల్ ఫండ్స్ గణనీయమైన లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అందుకే మ్యూచ్యువల్ ఫండ్స్‌లో భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతున్నాయి. ఈ మద్యకాలంలో రెట్టింపు లాభాలనిచ్చిన మ్యూచ్యువల్ ఫండ్స్ గురించి పరిశీలిద్దాం.
మ్యూచ్యువల్ ఫండ్స్‌లో స్వల్పకాలంలో ఎక్కువ లాభాలుంటాయనే నమ్మకంతో చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందుకు తగ్గట్టే ఈ మధ్యకాలంలో కొన్ని మ్యూచ్యువల్ ఫండ్స్ కస్టమర్లకు అమితమైన లాభాల్ని ఆర్జించిపెట్టాయి. కొన్ని మ్యూచ్యువల్ ఫండ్స్ అయితే రెట్టింపు అయ్యాయి. అది కూడా కేవలం 5 ఏళ్ల వ్యవధిలో. గత ఐదేళ్లలో రెట్టింపు లాభాలు ఇచ్చిన 5 మ్యూచ్యువల్ ఫండ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేవి పెద్ద పెద్ద కంపెనీల్లో మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ కేటగరీలో ఫండ్స్‌కు మంచి లాభాలు వస్తున్నాయి. గత 5 ఏళ్లలో 19 శాతం లాభం వచ్చింది.
ఇక రెండవది మల్టీ క్యాప్ ఫండ్స్. ఇవి కూడా మ్యూచ్యువల్ ఫండ్స్ పరిధిలోకే వస్తాయి. ఇందులో అయితే అన్ని రకాల వాటిలో పెట్టుబడి పెడుతుంటారు. అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి. మార్కెట్ క్యాప్ ప్రకారం పోర్ట్ ఫోలియో మారుతుంటుంది. ఈ విభాగంలో 25 శాతం లాభాలు వచ్చాయి. ఇక మూడవది ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్. ఇందులో వేర్వేరు రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇవి కూడా గత ఐదేళ్లలో అత్యధికంగా 21 శాతం రిటర్న్స్ అందించాయి.
నాలుగవది కాంట్రా ఫండ్స్. ఇందులో లాభాలతో పాటు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. రిస్క్ ఫ్యాక్ట్రర్ ఉన్నవే ఎంచుకుంటారు. ఇందులో గత ఐదేళ్లలో 27 శాతం లాభాలు వచ్చాయి. ఇక చివరిది మల్టీ అస్సెట్ అలొకేషన్. ఇందులో 10 శాతం చొప్పున విభిన్న కేటగరీల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. ఈ విభాగంలో ఇన్వెస్ట్‌మెంట్ బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటుంది. గత ఐదేళ్లలో 19.2 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఏదేమైనా సరే మ్యుచ్యువల్ ఫండ్స్‌లో పెట్టే పెట్టుబడికి రిటర్న్స్ ఉంటాయి గానీ రిస్క్ కూడా ఉంటుంది. ఇది ఆలోచించే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు దసరా కానుక, అక్టోబర్ 9న డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.