New Bank Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా..?

Bank Account Minimum Balance: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. మీకు ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం తప్పనిసరి. అయితే ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని నిబంధనలు పెట్టుకున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్‌లలో కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసుకోండి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 11:45 AM IST
New Bank Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా..?

Bank Account Minimum Balance: జాతీయ బ్యాంకులలో అకౌంట్ ఉంటే ఖాతాదారులకు అనేక పెద్ద సౌకర్యాలు ఉంటాయి. అయితే ఈ సౌకర్యాల ప్రయోజనాన్ని పొందడానికి.. మీరు కొన్ని నిబంధనలను కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో మీరు బ్యాంకుల కనీస సగటు బ్యాలెన్స్ నియమాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెడ్‌ఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లలో అకౌంట్ తప్పకుండా తెలుసుకోవాలి..

మీకు ఏ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నా.. తప్పనిసరిగా ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాలి. కనీస సగటు బ్యాలెన్స్ కింద.. మీరు అకౌంట్‌లో బ్యాంక్ నిర్ణయించిన బ్యాలెన్స్‌ను నిర్వహించాలి. మీరు కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోతే.. బ్యాంకు జరిమానా విధించనుంది. ప్రతి బ్యాంకు యావరేజ్‌ లిమిట్‌ను నిర్దేశిస్తుంది. ఖాతాదారుడు ఆ పరిమితి వరకు డబ్బును ఎల్లప్పుడూ అకౌంట్‌లోకి ఉంచుకోవాలి. కొన్ని బ్యాంకులు ఒకే పరిమితిని కలిగి ఉండగా.. కొన్ని వేర్వేరు లిమిట్స్‌ను కలిగి ఉంటాయి. దేశంలోని దిగ్గజ బ్యాంకులు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల మినిమమ్ బ్యాలెన్స్‌ వివరాలు గురించి తెలుసుకోండి. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్‌లో నిర్వహించాల్సిన కనీస బ్యాలెన్స్ మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎస్‌బీఐలో కనీస పరిమితి నగరాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.3 వేల వరకు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో రూ.వెయ్యి.. మీకు సెమీ అర్బన్ ఏరియా బ్రాంచ్‌లో ఖాతా ఉంటే మీ ఖాతాలో రూ.2 వేలు ఉంచాలి. మెట్రో సిటీలో ఈ లిమిట్‌ రూ.3 వేలు ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీలో సగటు కనీస బ్యాలెన్స్ లిమిట్ మీ రెసిడెన్సీపై ఆధారపడి ఉంటుంది. నగరాల్లో ఈ పరిమితి రూ.10 వేలు. సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 లిమిట్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ మాదిరిగానే ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించాలి. ఇక్కడ అర్బన్ ఏరియా ఖాతాదారుడికి రూ.10 వేలు, సెమీ అర్బన్‌కు రూ.5 వేలు, గ్రామీణ ప్రాంతానికి రూ.2,500 ఉండాలి. 

అయితే కొన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన వర్తించదు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా, పెన్షనర్ల సేవింగ్స్ ఖాతా, శాలరీ అకౌంట్, మైనర్ సేవింగ్స్ అకౌంట్‌లలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదు.

Also Read: IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!  

Also Read: Coronavirus Cases Today: కరోనా అలర్ట్.. నేడు భారీగా కేసులు నమోదు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News