New Wage Code: దేశంలో కొత్త వేతన కోడ్ అమలు కానుంది. జూలై 1 నుంచి అమలుకానున్న న్యూ వేజ్ కోడ్ కారణంగా జీతంలో ఏ మార్పులు రానున్నాయి, లాభమా నష్టమా అనేది పరిశీలిద్దాం..
ప్రభుత్వం జూలై 1 నుంచి కొత్త వేజ్ కోడ్ అమలు చేయబోతోంది. జూలై 1 నుంచి వేజ్ కోడ్ మారడం వల్ల ప్రైవేట్ రంగంలోని సిబ్బందిపై అధిక ప్రభావం పడనుంది. ఒకవేళ మీరు కూడా ప్రైవేట్‌రంగ ఉద్యోగస్థులైతే..ఈ వార్త మీ కోసమే. కొత్త వేతన కోడ్ అమలు తరువాత సిబ్బంది ఇన్‌టేక్ శాలరీ తగ్గిపోతుంది. కానీ పదవీ విరమణ అనంతరం ప్రయోజనాలుంటాయి.
కొత్త లేబర్ కోడ్ అమలు కావడం వల్ల మీకు లాభంతో పాటు నష్టమూ కలగనుంది. న్యూ వేజ్ కోడ్ 2019 జూలై 1 నుంచి ప్రాంభం కానుంది. అంటే సిబ్బంది సీటీసీలో బేసిస్ శాలరీ, హెచ్ఆర్ఏ, రిటైర్మెంట్ ప్రయోజనాలు పీఎఫ్, గ్రాట్యుటీ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో బేసిక్ శాలరీ 30-40 శాతముంటుంది. ఇది కాకుండజా స్పెషల్ అలవెన్స్, హెచ్‌ఆర్ఏ, పీఎఫ్ వంటివి ఉంటాయి. వీటి ఆధారంగా మీ శాలరీ నుంచి పీఎఫ్ కట్ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్త వేతన కోడ్ ప్రకారం బేసిక్ శాలరీ సీటీసీ 50 శాతం ఉంటుంది. దీని ప్రభావం నేరుగా పీఎఫ్, గ్రాట్యుటీపై పడుతుంది. మరోవైపు కొత్త వేతన కోడ్ ప్రకారం..వారంలో 48 గంటలు పనిచేయాలి. ఒకవేల మీరు రోజుకు 12-12 గంటలు పనిచేస్తుంటే..మీకు మీ కంపెనీ నుంచి 3 వీక్ ఆఫ్స్ ఇవ్వాల్సి ఉంది.
ఉదాహరణకు మీ సీటీసీ 50 వేలనుకుంటే..ప్రస్తుతం మీ బేసిక్ శాలరీ 15 వేలరూపాయలుంటుంది. అంటే పీఎఫ్ నెలకు 18 వందల రూపాయలు చెల్లించాలి. కానీ కొత్త నిబంధనల ప్రకారం 50 వేల సీటీసీపై బేసిక్ శాలరీ 15 వేల నుంచి 25 వేలు కానుంది. దీనిపై 12 శాతం వడ్డీ అంటే 3 వేలవుతుంది. అంటే ఇప్పుుడు గతం కంటే 12 వందల రూపయలు పెరిగింది.
బేసిక్ శాలరీ పెరగడం అంటే దాని ప్రభావం పీఎఫ్, గ్రాట్యుటీ రెండింటిపై ఉంటుంది. ఈ రెంటింటిలో కంట్రిబ్యూషన్ పెరగడం వల్ల టేక్‌హోమ్ శాలరీ తగ్గుతుంది. కానీ ఆ ప్రయోజనం రిటైర్మెంట్ సమయంలో ఉంటుంది.
Also read: Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.