PAN-Aadhaar Linking: పర్సనల్ ఫైనాన్స్ పరంగా చూస్తే వీళ్లు వాళ్లు అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ మార్చి నెల అనేది చాలా ముఖ్యమైనది. ఆర్థిక సంవత్సరంలో చివరి నెల అయిన మార్చి నెలతోనే ఎన్నో ఆర్థిక పరమైన అంశాలకు గడువు ముగుస్తుంటుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డుతో జత చేయడం మొదలుకుని టాక్స్ ప్లానింగ్ వరకు ఎన్నో అంశాలకు మార్చి నెలను చివరి గడువుగా విధిస్తుంటారు. ఒకవేళ ఏదైనా కారణం చేత నిర్ణీత గడువులోగా ఆ టాస్కులు పూర్తి చేయలేదంటే.. అందుకు భారీ జరిమానాల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కొన్నిసార్లు అంతకి మించిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పాన్ కార్డు - ఆధార్ కార్డుతో లింక్ చేయడం
మార్చి 31వ తేదీలోగా పర్మనెంట్ ఎకౌంట్ నెంబర్‌ని ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందిగా ఇన్‌కమ్ టాక్స్ విభాగం తుది గడువు విధించింది. ఒకవేళ మీ పాన్ నెంబర్‌ని ఆధార్ కార్డుతో జత చేయనట్టయితే.. ఏప్రిల్ 1 తరువాత మీ పాన్ కార్డు ఇనాక్టివేట్ అవుతుంది. పాన్, ఆధార్ లింక్ చేయకున్నా.. ఇన్‌కమ్ టాక్స్ చెల్లించడానికి వీలు అవుతుంది కానీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి వీలు ఉండదు.
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్‌డేటెడ్ ఐటి రిటర్న్స్
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్‌డేటెడ్ ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి మార్చి 31, 2023 ఆఖరి గడువుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఐటి రిటర్న్స్ దాఖలు చేసుకోలేకపోయిన వారి కోసమే ఈ అప్‌డేటెడ్ ఐటి రిటర్న్స్ దాఖలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం ఈ అవకాశం ఇచ్చింది.
టాక్స్ సేవింగ్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లానింగ్
2022-23 ఆర్థిక సంవత్సరానికి టాక్స్ సేవింగ్ ఇన్‌వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి 31 మార్చి, 2023 వరకు గడువు ఉంది. టాక్స్ భారాన్ని తగ్గించుకోవడం కోసం చాలా మందికి తమ ముందుండే ఏకైక మార్గం టాక్స్ సేవింగ్స్ ఇన్‌వెస్ట్‌మెంట్స్. పన్ను మినహాయింపు ఉండే ఇన్‌వెస్ట్‌మెంట్స్ పెట్టడం వల్ల పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.
అడ్వాన్స్ టాక్స్ పేమెంట్
2022-2023 ఆర్థిక సంవత్సరానికిగాను అడ్వాన్స్ టాక్స్ ఫైనల్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడానికి 15, మార్చి 2023 చివరి తేదీగా ఉంది. ఆరోజులోగా 100 శాతం అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించలేని పక్షంలో ఇన్‌కమ్ టాక్స్ చట్టం ప్రకారం 234B, 243C సెక్షన్ల కింద జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రధాన మంత్రి వయ వందన యోజన
ప్రధాన మంత్రి వయ వందన యోజన అనేది ఇన్సూరెన్స్ కమ్ పెన్షన్ స్కీమ్. ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం రిటైర్మెంట్ తీసుకున్న సీనియర్ సిటిజెన్స్‌కి పెన్షన్ రూపంలో ఆర్థిక భరోసా లభిస్తుంది. అయితే ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా మార్చి 31, 2023 తుది గడువుగా ఉంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకింగ్ మొదలుకుని ఇలాంటి ముఖ్యమైన ఎన్నో అంశాలకు మార్చి 2023 కీలకం కానుంది. మీరు కూడా ఇవి పూర్తి చేశారా లేదా అనేది చెక్ చేస్కోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు.
ఇది కూడా చదవండి : Aadhaar Card Update News: ఆధార్ కార్డుదారులకు ముఖ్యమైన గమనిక
ఇది కూడా చదవండి : PM Svanidhi Yojana: ఈ లోన్ తీసుకుంటే నయాపైస వడ్డీ లేదు.. గ్యారెంటీ అసలే లేదు
ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
PAN-Aadhaar Linking: మార్చి 2023 లో మర్చిపోకుండా చేయాల్సిన ముఖ్యమైన పనులు