Petrol Diesel Price: గుడ్‌న్యూస్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Petrol Diesel Latest Rates: వాహనదారులకు ఉపశమనం కలిగించేలా త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. పెట్రోల్. డీజిల్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2023, 11:58 PM IST
Petrol Diesel Price: గుడ్‌న్యూస్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Petrol Diesel Latest Rates: గత ఏడాదికిపైగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి పెరుగుదల లేకున్నా.. ఇప్పటికే రేట్లు కొండెక్కి కూర్చుకున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. చాలా రోజులుగా ధరలు స్థిరంగా ఉన్నా.. వాహనదారులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు.  గతేడాది ఏప్పిల్ తరువాత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పెట్రోలు ధర రూ.90 పైగా ఉండగా.. చాలా రాష్ట్రాల్లో పెట్రోలు ధర 100 రూపాయలకు పైగానే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలే నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. 

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించే సూచనలను కేంద్ర ప్రభుత్వం అందించినట్లు సమాచారం. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. చమురు కంపెనీల నష్టాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. 

ఆ తరువాత చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర నిలకడగా ఉంటే.. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఊపశమనం కలిగించే ఛాన్స్ ఉంది. ఆయిల్ కంపెనీలు ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తే ప్రభుత్వానికి కూడా ఎంతో ఊరట కలుగుతుంది. పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటనతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని వాహనదారుల్లో ఆశలు మొదలయ్యాయి.

Also Read: World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే..?  

Also Read: AP Inter Results 2023: రేపే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x