Petrol Price Today on 7 December 2020 Update: గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా వరుసగా ఆరోరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రెండేండ్ల గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయడం ముడిచమురు ధరలు పెరగడంతో మరోసారి ఇంధన ధరలు పుంజుకున్నాయి.
సామాన్యుడిపై, వాహనదారులపై మరింత భారం పడనుంది. తాజాగా ఢిల్లీ (Delhi)లో పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెంచారు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర (Petrol Price Today) రూ.83.41 నుంచి రూ.83.71కి చేరింది. అదే సమయంలో డీజిల్ ధర రూ.73.62 నుంచి 73.87కి చేరుకుంది. సెప్టెంబర్ 2018 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర (Petrol Price Today In Hyerabad) రూ.87.06, డీజిల్ ధర రూ.80.32గా ఉంది. ఆయా రాష్ట్రాలలో వసూలు చేసే పన్నుల ఆధారంగా ఇంధన ధరలలో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తుంది.
Also Read : EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేయండి
ముంబైలో నేటి పెట్రోల్ ధర రూ.90.34, డీజిల్ ధర రూ.80.54గా ఉంది. దేశంలో అత్యధిక పెట్రో ధరలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో అధిక ధరలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.51, డీజిల్ ధర రూ.79.21గా ఉండగా.. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.85.13, డీజిల్ ధర రూ.77.44కు చేరింది.
Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe