PM Awas Yojana Online Apply : సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు. ఒక ప్రస్తుతం ఉన్న కాలంలో సొంత ఇల్లు కొనుగోలు చేయాలన్న కట్టుకోవాలని కూడా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అయితే ఇందుకోసం మీరు డబ్బును పొదుపు చేసి ఇల్లు కట్టుకోవాలంటే, చాలా సమయం పడుతుంది. దాని కన్నా బ్యాంకు నుంచి రుణం పొంది మీరు హోమ్ లోన్ ద్వారా ఇంటిని కొనుగోలు చేసినట్లయితే, ప్రతినెల సులభ వాయిదాల్లో డబ్బు చెల్లించినట్లయితే, మీరు బ్యాంకుకు వడ్డీ ఈజీగా చెల్లించగలరు.
అయితే సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మీరు చెల్లించే వడ్డీ పై రాయితీని అందిస్తోంది. ఈ పథకాన్ని పొందడం ద్వారా మీరు చెల్లించే రుణంపై వడ్డీలో దాదాపు రూ.2.50 లక్షల వరకు సబ్సిడీని పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద ఇప్పటికే కోట్లాదిమంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సబ్సిడీని సైతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పీఎం ఆవాస్ యోజన కింద రూ. 25 లక్షల లోపు ఉండే ఇళ్లకు సబ్సిడీ లోన్స్ అందించింది గడచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు 59 వేల కోట్ల రూపాయల విలువైన సబ్సిడీ లబ్ధిదారులకు అందింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రకటించారు.
Also Read : Narayana: రేవంత్ జైలుకే.. బాంబు పేల్చిన సీపీఐ నారాయణ
ఇదిలా ఉంటే మీరు పీఎం ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి పొందాలి అనుకున్నట్లయితే, ఆన్ లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. PMAY వెబ్ సైట్ సందర్శించి అందులో మీ ఆధార్ నెంబర్ నమోదు చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో మీ వ్యక్తిగత వివరాలు అడ్రస్ ఇతర ఆదాయం వివరాలు ఉంటాయి. దరఖాస్తు ఫారంలో అందుబాటులో ఉన్నటువంటి సమాచారం పూర్తిగా సరైనదై ఉండాలి. అనంతరం ఐడెంటిటీ కార్డు అడ్రస్ ప్రూఫ్ లు ఇంకమ్ సర్టిఫికెట్ వంటివి కూడా జతపరిచి మీరు దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అర్హులైన దరఖాస్తుదారులు మీ హోమ్ లోన్ వడ్డీ రేటు పై సబ్సిడీని పొందే అవకాశం లభిస్తుంది. తద్వారా ఈ సబ్సిడీ వల్ల మీ ఇంటి నిర్మాణం ఖర్చు కొద్ది మేర తగ్గే అవకాశం ఉంటుంది. దరఖాస్తుదారుడు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అనంతరం ఎప్పటికప్పుడు మీ దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. ఇందులో మీ స్టేటస్ ను ట్రాక్ చేసుకోవచ్చు.
Also Read : Kangana Ranaut : కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు.. కన్నెర్ర జేసిన సొంత పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.