PK Kisan New Rule: పీఎం కిసాన్ యోజనలో కొత్త నిబంధన, డబ్బు వాపసు చేయకపోతే చర్యలు తప్పవు

PK Kisan New Rule: ప్రధానమంత్రి కిసాన్ యోజనలో ప్రభుత్వం 8 మార్పులు చేసింది. అందుకు తగ్గట్టుగా మీరు అప్‌డేట్ కాకపోతే..వెంటనే పీఎం కిసాన్ యోజన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. లేకపోతే ప్రభుత్వమే వసూలు చేస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 22, 2022, 04:28 PM IST
PK Kisan New Rule: పీఎం కిసాన్ యోజనలో కొత్త నిబంధన, డబ్బు వాపసు చేయకపోతే చర్యలు తప్పవు

PK Kisan New Rule: ప్రధానమంత్రి కిసాన్ యోజనలో ప్రభుత్వం 8 మార్పులు చేసింది. అందుకు తగ్గట్టుగా మీరు అప్‌డేట్ కాకపోతే..వెంటనే పీఎం కిసాన్ యోజన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. లేకపోతే ప్రభుత్వమే వసూలు చేస్తుంది. 

ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్దిదారులు ఈ పధకానికి సంబంధించి వస్తున్న అప్‌డేట్స్ ఫాలో కావాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటివరకూ 8 సార్లు ఈ పధకంలో మార్పులు చేసింది. ఈ పధకంలో భాగంగా మీరు మీ డాక్యుమెంట్స్ అప్‌డేట్ చేయకపోతే..వెంటనే చేసేయాలి. ఎందుకంటే ఈ పధకం విషయంలో జరుగుతున్న నకిలీ లబ్దిదారుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అప్‌డేట్ కాలేదంటే..మీరు కూడా తప్పుడు విధానంలో డబ్బులు తీసుకుంటున్న ఫేక్ జాబితాలో చేరిపోతారు. ఇప్పటివరకూ అందిన అన్ని వాయిదాల్ని తిరిగి చెల్లించాలి. లేకపోతే ప్రభుత్వమే తిరిగి వసూలు చేస్తుంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో 11 వాయిదాలు జమ అయ్యాయి. ఇప్పుడు 12వ వాయిదా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఈ పధకంలో పారదర్శకత కోసం..కొన్ని మార్పులు చేసింది. అనర్హులైన లబ్దిదారుల్ని గుర్తించేందుకు ఈ మార్పులు అవసరమయ్యాయి. ఇందులో భాగంగా ఇ కేవైసీ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చాలామంది ట్యాక్స్ పేయర్లు లబ్ది పొందుతున్నారు. మరోవైపు కొన్ని కుటుంబాల్లో అయితే భార్యాభర్తలిద్దరూ లబ్దిపొందుతున్న పరిస్థితి ఉంది. పొలం ఇద్దరికీ ఉన్నా..ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నట్టైతే, పిల్లలు మైనర్లు అయితే.. ఒకరికే లబ్ది వర్తిస్తుంది. ప్రభుత్వం ఇలాంటి నకిలీ రైతులపై చర్యలు ప్రారంభించి..నోటీసులు కూడా పంపిస్తోంది. మీరు ఒకవేళ ఇలాంటి పొరపాటు లేదా తప్పు చేసినట్టేతే వెంటనై ఆ డబ్బును వాపసు చెల్లించేయండి. దీనికోసం ప్రభుత్వం కిసాన్ పోర్టల్‌పై ఓ సౌకర్యం కల్పించింది. ఆ వివరాలు మీ కోసం..

ముందుగా  https://pmkisan.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి. కుడివైపున ఉన్న బాక్స్‌లో దిగువన Refund online ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు రెండు ప్రత్యామ్నాయాలు కన్పిస్తాయి. ఇందులో మొదటిది ఒకవేళ మీరు పీఎం కిసాన్ డబ్బులు వాపసు చేసుంటే మొదటి ఆప్షన్ చెక్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. ఆ తరువాత ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ నమోదు చేయాలి. ఇప్పుడు ఇమేజ్ టెక్స్ట్ టైప్ చేసి గెట్ డేటా క్లిక్ చేయాలి. ఇందులో మీరు అర్హులైతే You are not eligible for any fefund amount మెస్సేజ్ వస్తుంది. లేకపోతే రిఫండ్ నగదు కన్పిస్తుంది. 

Also read: Toll Tax: 12 గంటల్లోగా తిరిగొచ్చేస్తే..టోల్‌‌ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేదు, వైరల్ అవుతున్న మెస్సేజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News