PPF Withdrawal Rules: పీపీఎఫ్‌ నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేయాలి..? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

PPF Withdrawal Rules in Telugu: పీపీఎఫ్‌ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి. నగదు ఉపసంహరణకు మీ వద్ద కచ్చితమైన కారణం ఉండాలి. ఏయే డాక్యుమెంట్స్ ఉండాలి..? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి..? వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2023, 03:38 PM IST
PPF Withdrawal Rules: పీపీఎఫ్‌ నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేయాలి..? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

PPF Withdrawal Rules in Telugu: ప్రస్తుతం ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ఒకటి. ఈ సేవింగ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు సేఫ్‌గా ఉండడంతోపాటు ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ తరువాత డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలని చాలా మందికి డౌట్‌గా ఉంటుంది. పీపీఎఫ్‌ విత్ డ్రా చేసుకునేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు..? అర్హత ఏంటి..? పూర్తి వివరాలు ఇలా..

పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసి మీ మొదటి డిపాజిట్ చేసిన ఆర్థిక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాలు గడిచిన తరువాత మాత్రమే పాక్షికంగా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పాక్షిక ఉపసంహరణ చేయవచ్చు. ఎంత డబ్బు తీసుకోవచ్చు అనే దాని గురించి కొన్ని నియమాలు ఉన్నాయి. గరిష్ట ఉపసంహరణ మొత్తం రెండు మొత్తాలలో తక్కువకు లిమిట్ ఉంటుంది.

==> విత్ డ్రా చేస్తున్న సంవత్సరానికి ముందు నాల్గో ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌లో 50 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. లేదా
==> మునుపటి సంవత్సరం చివరిలో బ్యాలెన్స్‌లో 50 శాతం ఉపసంహరించుకోవచ్చు.

అయితే పీపీఎఫ్‌ నుంచి నగదు ఉపసంహరణకు ఏం కారణం ప్రస్తావిస్తున్నామో ముందుగా తెలుసుకోవాలి. ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడం, వైద్య ఖర్చులు, ఇల్లు కొనడం లేదా నిర్మించడం, మీ పిల్లల పెళ్లిళ్ల ఖర్చులు వంటివి వాటికి డబ్బులు తీసుకోవచ్చు.

డబ్బులు ఎక్కడ విత్ డ్రా చేసుకోవాలి..?

==> బ్యాంక్ లేదా పోస్టాఫీసును సందర్శించండి: పీపీఎఫ్‌ అకౌంట్ కలిగి ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వెళ్లండి. పీపీఎఫ్‌ పాస్‌బుక్, కొన్ని గుర్తింపు పత్రాలను తీసుకెళ్లండి 
==> విత్ డ్రా ఫామ్ తీసుకోండి: బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుంచి విత్ డ్రా ఫామ్ అడగండి. ఉపసంహరణ ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి. విత్ డ్రాకు గల కారణాన్ని పేర్కొనండి. మీ రిక్వెస్ట్‌పు ప్రాసెస్ చేయడంలో ఆలస్యం జరగకుండా ఉండాలంటే.. అన్ని వివరాలను సరిగ్గా అందించాలి.
==> మీరు డబ్బును ఎందుకు ఉపసంహరించుకుంటున్నారనే విషయానికి సంబంధించి రుజువుగా కొన్ని అదనపు పత్రాలను ఇవ్వవలసి ఉంటుంది. ఉదాహరణకు ఇది వైద్య ఖర్చుల కోసం అయితే మెడికల్ బిల్లులను చూపవలసి ఉంటుంది. వివాహానికి సంబంధించినదైతే వివాహ ఆహ్వానం అవసరం కావచ్చు.
==> పూర్తి చేసిన ఉపసంహరణ ఫారమ్, ఏదైనా అవసరమైన పత్రాలను బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు అందజేయండి. ప్రతిదీ పీపీఎఫ్‌ నిబంధనలకు అనుగుణంగా ఉందని గుర్తుపెట్టుకోండి. 
==> బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ మీ అభ్యర్థనను నిర్ణీత ధృవీకరణ తర్వాత ప్రాసెస్ చేస్తుంది. యాక్సెప్ట్ చేస్తే.. మీ ప్రాధాన్యతను బట్టి డబ్బు మీ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు. లేదా మీకు చెక్‌గా అందజేస్తారు.

Also Read: KL Rahul Poor Keeping: కేఎల్ రాహుల్ చెత్త కీపింగ్‌తో భారత్‌కు లాభం.. రెండు వికెట్లు సమర్పించుకున్న ఆసీస్

Also Read: PRSI National Awards: ఐటీ శాఖ తెలంగాణ డిజిటల్ మీడియా విభాగానికి అవార్డుల పంట 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News