How To Get Loan On Ppf Account: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకం. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన స్కీమ్ ఇది. ఈ పథకంలో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, రాబడితో పాటు భద్రత ఉంటుంది. ఇందులో వచ్చే ఆదాయంపై కూడా పూర్తిగా పన్ను రహితం. మీరు సురక్షితమైన పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నట్లయితే పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయండి. కొంతకాలం తరువాత మీ పీపీఎఫ్ నుంచి లోన్ కూడా తీసుకునే సదుపాయం ఉంటుంది.
పీపీఎఫ్ పెట్టుబడిని మొత్తం ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1,50 వేలతో ఒకేసారి లేదా 12 నెలవారీ చెల్లింపుల ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఖాతా మెచ్యూరిటీ తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు రాతపూర్వక అభ్యర్థన చేసినట్లయితే.. ఖాతా 15 ఏళ్ల కాలవ్యవధిని వడ్డీని కోల్పోకుండా ఐదేళ్లపాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్లాక్‌లకు పొడిగించవచ్చు. పీపీఎఫ్ ఖాతాదారులు అర్హతను బట్టి.. నగదు కొరత ఏర్పడినప్పుడు లోన్ సదుపాయాన్ని పొందవచ్చు.
పీపీఎఫ్ ఖాతాదారులు మూడో ఆర్థిక సంవత్సరం తర్వాత లోన్ తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే లోన్ ఆప్షన్ ఆరవ ఆర్థిక సంవత్సరం చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని లోన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. లోన్ రిక్వెస్ట్ పెట్టిన తరువాత ముందు రెండు సంవత్సరాల చివరిలో లభించే మొత్తంలో గరిష్టంగా 25 శాతాన్ని రుణంగా పొందవచ్చు.
పీపీఎఫ్ ఖాతా నుంచి లోన్ తీసుకున్న దానిపై వడ్డీ రేటు.. ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన పీపీఎఫ్ వడ్డీ రేటు కంటే 1 శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లోన్ కావాలంటే.. మీ స్థానిక పీపీఎఫ్ బ్రాంచ్‌ని సందర్శిస్తే సరి. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1% ఉండగా.. మీరు తీసుకునే లోన్‌పై వడ్డీ రేటు 8.1 శాతం అవుతుంది. ఒకసారి లోన్‌పై వడ్డీ రేటును నిర్ణయించిన తర్వాత.. అది తిరిగి చెల్లించే వరకు అలాగే ఉంటుంది. లోన్ మంజూరైన తర్వాత మొదటి నెల నుంచి ప్రారంభించి.. 36 నెలలలోపు లోన్ అసలు మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాలి. రుణాన్ని తిరిగి చెల్లించకపోయినా.. లేదా కేటాయించిన 36 నెలలలోపు పాక్షికంగా మాత్రమే తిరిగి చెల్లిస్తే.. లోన్ పొందిన నెలలో 1వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం ఒక శాతానికి బదులుగా 6 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు.
Also Read: Building Collapses Video: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. వీడియో చూశారా..!
Also Read: Suma Adda Show: సుమక్కా.. అవి లారీ కింద నిమ్మకాయలు.. ఎంత పనిచేశావ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.