Digital currency: డిజిటల్ కరెన్సీపై ఆర్​బీఐ కసరత్తు.. వచ్చే వారం పార్లమెంట్​లో క్రిప్టో కరెన్సీ బిల్లు!

Digital currency: క్రిప్టోకరెన్సీల నియంత్ర బిల్లు వచ్చే వారం పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్​బీఐ కసరత్తు ముమ్మరం చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 07:32 PM IST
  • డిజిటల్ కరెన్సీ దిశగా ఆర్​బీఐ వడివడిగా అడుగులు
  • వచ్చే వారం పార్లమెంట్​ ముందుకు క్రిప్టో కరెన్సీ బిల్లు!
  • క్రిప్టో లావాదేవీలపై నియంత్రనే ప్రధాన లక్ష్యం!
Digital currency: డిజిటల్ కరెన్సీపై ఆర్​బీఐ కసరత్తు.. వచ్చే వారం పార్లమెంట్​లో క్రిప్టో కరెన్సీ బిల్లు!

All set to bring a bill in Parliament for regulations and guidelines on cryptocurrencies: పార్లమెంటు​ శీతాకాల సమావేశాల్లోనే క్రిప్టోకరెన్సీల నియంత్ర బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. నియంత్రణ నిబంధనలతో పాటు.. క్రిప్టో కరెన్సీ మార్గదర్శకాలు కూడా ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిజిటల్​ కరెన్సీని విడుదల చేసేందుకు ఆర్​బీఐ కసరత్తు ముమ్మరం (RBI Digital Currecncy) చేసింది.

'క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్​, అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021'ను (Cryptocurrency Bill) వచ్చే వారం లోక్​ సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్​బీఐకి వీలు కల్పించే విధంగా ఉండనుంది. దీనితో పాటు ఇతర అన్ని ప్రైవేట్​ డిజిటల్ కరెన్సీలపై నిషేధం విధించే విధంగా ఉంటుందని  (Cryptocurrency Ban in India) సమాచారం. అయితే క్రిప్టో కరెన్సీల అంతర్గత సాంకేతికత విషయంలో పలు మినహాయింపులు ఉంటాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

గతంలో బ్యాన్​ చేసినా..

నిజానికి గతంలో ఓసారి క్రిప్టో కరెన్సీలపై ఆర్​బీఐ నిషేధం విధించింది. అయితే ఈ విషయంపై ఓ సమాజిక కార్యరకర్త వేసిన పిటిషన్​ను విచారించిన సుప్రీం కోర్టు.. ఆర్​బీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. క్రిప్టో కరెన్సీని నిషేధించేందుకు చట్టపరంగా అధికారాలు లేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం దేశంలో ఏ క్రిప్టో కరెన్సీపైనా నిషేధం గానీ ఆంక్షలు గానీ లేవు. అందుకే ప్రస్తుతం భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీల నియంత్రణ బిల్లును తీసుకురానుంది.

ఏమిటి ఈ క్రిప్టో కరెన్సీ..

క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్​ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేక సాఫ్ట్​వేర్​ కోడ్​ల ద్వారా పని (What is Cryptocurrency) చేస్తుంటాయి. మనం సాధారణంగా చూసే కరెన్సీలను భౌతికంగా చూడగలం, ముట్టుకోగలం. అయితే క్రిప్టో కరెన్సీని సాఫ్ట్​వేర్​తో రూపొందించి కరెన్సీ. కాబట్టి వీటిని భౌతికంగా చూడలేం, ముట్టుకోలేం.

పేరుకు తగ్గట్లుగానే.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్​ చైన్​ సాంకేతికతలు క్రిప్టోకరెన్సీకి మూలాధారాలు. బ్లాక్​ చైన్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తున్నందున క్రిప్టో కరెన్సీల లావాదేవీలను సురక్షితంగా జరుగుతుంటాయి.

Also read: Digital payment: డిజిటల్ లావాదేవీల జోరు- 12 నెలల్లో 53 శాతం వృద్ధి!

Also read: Stock Market today: కుదిపేసిన ఒమిక్రాన్ భయాలు- స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News