Jio Fiber Plans: జియో ఫైబర్ నుంచి సరికొత్త ప్లాన్, 14 ఓటీటీ యాప్స్ 550 ఛానెల్స్, రోజుకు 100 ఎంబీబీఎస్ స్పీడ్ ఇంటర్నెట్, ధర ఎంతంటే

Jio Fiber Plans: టెలీకం రంగంలో పాగా వేసిన రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా పాతుకుపోతోంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 6, 2023, 10:51 AM IST
Jio Fiber Plans: జియో ఫైబర్ నుంచి సరికొత్త ప్లాన్, 14 ఓటీటీ యాప్స్ 550 ఛానెల్స్, రోజుకు 100 ఎంబీబీఎస్ స్పీడ్ ఇంటర్నెట్, ధర ఎంతంటే

Jio Fiber Plans: మొబైల్ నెట్‌వర్క్ పరంగా దేశంలోనే అగ్రగామిగా నిలబడిన రిలయన్స్ జియో అన్నింటా తనదైన మార్క్ చూపిస్తోంది. అద్భుతమైన పథకాలతో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో సైతం దూసుకుపోతోంది. జియో ఫైబర్‌లో సరికొత్త ప్లాన్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

భారత టెలీకం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో ఇప్పుడు ఫైబర్‌లో సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తూ ప్రత్యర్ధులకు గట్టి సవాల్ విసురుతోంది. దేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ మరింత పెంచుకునేందుకు వివిధ కంపెనీలు పోటీ పడుతున్నాయి. రిలయన్స్ సంస్థ సైతం జియో ఫైబర్‌తో వాటా పెంచుకుంటోంది. ఇప్పుడు మరో సరికొత్త ప్లాన్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో పెరిగిన ఓటీటీ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని జియో ఫైబర్ సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. 

జియో ఫైబర్ ప్లాన్ వివరాలు

జియో ఫైబర్ అందిస్తున్న ఈ ప్లాన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్. నెలకు 899 రూపాయలకు జీఎస్టీ అదనం. ఇందులో రోజుకు 100 ఎంబీబీఎస్ వేగంతో అపరిమితమైన డేటా లభిస్తుంది. 100 ఎంబీపీఎస్ అంటే చాలా వేగముంటుంది. సాఫ్ట్‌వేర్, గేమింగ్ వృత్తుల్లో ఉన్నవారికి సైతం ఉపయోగపడుతుంది. దీంతో పాటు 14 కంటే ఎక్కువ ఓటీటీలు ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ 3, 6, 12 నెలల కాల పరిమితితో ఉంటుంది. ఉచితంగా వైఫై రూటర్ అందిస్తారు. ఇన్‌స్టాల్లేషన్ దాదాపుగా ఉచితం. నెలకు 3.3 టీబీ డేటా కావడంతో డేటా అయిపోతుందనే ఆందోళన ఉండదు. 

హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు ఈ జియో ఫైబర్ ప్లాన్‌లో 550 ప్లస్ టీవీ ఛానెళ్లు ఆన్‌లైన్ డిమాండ్ టీవీ ఉంటుంది. టీవీ కార్యక్రమాలు, సినిమాలు, స్పోర్ట్స్ కోసం అనువైన ప్లాన్ ఇది. ఈ ప్లాన్‌తో ఉచితంగా సెటప్ బాక్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్నవారికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, సన్‌నెక్స్ట్, హాయ్‌చోయ్. డిస్కవరీ ప్లస్, యూనివర్శల్ ప్లస్, ఇరోస్ నౌ, ఆల్ట్ బాలాజీ, లయన్స్ గేట్ ప్లే, షిమారో మీ, జియో సినిమా, జియో సావన్ వంటి ఓటీపీలు ఉచితం.

Also read: Wrong UPI Payments Solution: పొరపాటున ఒకరికి పంపించాల్సిన డబ్బులను మరొకరికి పంపిస్తే ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News