Jio Prepaid Plans: జియోలో రీచార్జ్‌తో పాటు డిస్నీ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్

Reliance Jio New Prepaid Plans: రిలయన్స్ జియో కొత్తగా ప్రవేశపెట్టిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో డిస్నీ హాట్ స్టార్ ప్రీమియం యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 07:28 PM IST
  • రిలయన్స్ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
  • రూ.1499, రూ.4199తో కూడిన ప్లాన్స్
  • ఈ ప్లాన్స్‌తో హాట్ స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితం
Jio Prepaid Plans: జియోలో రీచార్జ్‌తో పాటు డిస్నీ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్

Reliance Jio New Prepaid Plans: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. రూ.1499, రూ.4199తో కూడిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం. ఇప్పటికే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు పలు రీచార్జ్ ప్లాన్స్‌లో భాగంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అయితే రిలయన్స్ జియో తాజాగా ప్రవేశపెట్టిన ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో అంతకుమించిన బెనిఫిట్స్ ఉన్నాయి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ ప్లాన్, ప్రీమియం ప్లాన్‌కి తేడా :

ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మొబైల్ ప్లాన్‌ ధర సంవత్సరానికి రూ.499. ఈ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ప్రసారాలను వీక్షించవచ్చు. అన్ని రకాల కంటెంట్‌కి యాక్సెస్ ఉంటుంది. అయితే ఇది యాడ్ ఫ్రీ కాదు. ఇక రూ.1499తో కూడిన ప్రీమియం ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రసారాలను ఏడాది పాటు యాడ్ ఫ్రీగా వీక్షించవచ్చు. అంతేకాదు, ఒకేసారి నాలుగు డివైజ్‌ల నుంచి యాక్సెస్ పొందవచ్చు. 4కె రిజల్యూషన్, డాల్బీ 5.1 సౌండ్ ఫీచర్స్‌‌ ఇందులో ఉంటాయి.

రిలయన్స్ జియో రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ :

రిలయన్స్ జియో అందిస్తున్న రూ.1499 ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా చొప్పున పొందవచ్చు. అంటే మొత్తంగా 168 జీబీ డేటాను ఈ ప్లాన్ అందిస్తుంది. అయితే డైలీ డేటా లిమిట్ దాటితే ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌కి పడిపోతుంది. ఇక ఇదే రూ.1499 ధరతో రిలయన్స్ జియో మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 మెసేజ్‌లతో పాటు ఏడాది పాటు డిస్నీ హాట్ స్టార్ ప్రీమియం యాక్సెస్‌ను పొందవచ్చు. అలాగే జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ, జియో సినిమాలకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. 

రిలయన్స్ జియో రూ.4199 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా ఏడాదిలో 365 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా చొప్పున పొందవచ్చు. అంటే.. మొత్తంగా 1095 జీబీ డేటా పొందుతారు. డైలీ లిమిట్ దాటితే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కి పడిపోతుంది. ఇదే ధరలో రిలయన్స్ జియో తీసుకొచ్చిన తాజా ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌, ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం యాక్సెస్ పొందవచ్చు. అలాగే జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ, జియో సినిమాలకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అంతేకాదు, ఈ ప్లాన్ ద్వారా జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద రూ.200 వరకు పొందవచ్చు.

Also Read: Secret Whatsapp Tips: మీ గర్ల్ ఫ్రెండ్ వాట్సాప్‌లో గంటల తరబడి ఆన్‌లైన్‌లో ఉంటుందా..? ఎవరితో చాట్ చేస్తుందో ఇలా తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News