Reliance Jio: మీకు నచ్చిన వీఐపీ నెంబర్ కేవలం 499 రూపాయలకు పొందే అద్భుత అవకాశం

Reliance Jio: రిలయన్స్ జియో టెలీకం రంగంలో దిగ్గజ సంస్థగా మారింది. అనతికాలంంలోనే ఇతర టెలీకం కంపెనీల్ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు తన కస్టమర్లకు వీఐపీ నెంబర్లు సులభంగా పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2023, 11:27 AM IST
Reliance Jio: మీకు నచ్చిన వీఐపీ నెంబర్ కేవలం 499 రూపాయలకు పొందే అద్భుత అవకాశం

Reliance Jio: చాలామందికి ఫ్యాన్సీ నెంబర్లంటే క్రేజ్ ఎక్కువ. ఇంకొంతమందికి కొన్ని ప్రత్యేక నెంబర్లు అంటే సెంటిమెంట్ ఉంటుంది. మరి కొందరు వీఐపీ నెంబర్లు కోరుకుంటుంటారు. అందుకే కస్టమర్లు తమకు నచ్చిన వీఐపీ నెంబర్ ఎంచుకునే సౌకర్యాన్ని రిలయన్స్ జియో కల్పిస్తోంది. దీని ప్రకారం యూనిక్, స్పెషల్ కాంబినేషన్ నెంబర్లను పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

వీఐపీ నెంబర్లకు ఎప్పుడూ ప్రత్యేకత ఉండనే ఉంటుంది. లక్కీ నెంబర్లు, పుట్టిన తేదీ, ఇతర కాంబినేషన్లను ఫోన్ నెంబర్‌గా కలిగి ఉంటే ఆ వెసులుబాటే వేరు. ఫ్యాన్సీ లేదా ప్రత్యేక నెంబర్లంటే కొంతమందికి ఎంత క్రేజ్ ఉంటుందంటే తమ వాహనాలకు ఆ నెంబర్లు పొందేందదుకు లక్షల రూపాయలు ఖర్చుపెడుతుంటారు. అయితే రిలయన్స్ జియో ఇప్పుడు తమ కస్టమర్లు సాధారణ ప్రైస్‌కే వీఐపీ నెంబర్ పొందే అవకాశం కల్పిస్తోంది. 

ఈ వెసులుబాటు ప్రకారం కస్టమర్లు చాలా సులబంగా తమకు కావల్సిన వీఐపీ నెంబర్ జియో వెబ్‌సైట్ ద్వారా నేరుగా పొందవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా రిలయన్స్ జియో అధికారిక వెబ్‌సైట్ www.jio.com/selfcare/choice-number/ ఓపెన్ చేయాలి. కస్టమర్లు అక్కడ ఉండే వీఐపీ నెంబర్ల జాబితాలో నచ్చిన నెంబర్ ఇలా సులభంగా ఎంపిక చేసుకోవచ్చు.

ముందు జియో అధికారిక వెబ్‌సైట్ www.jio.com/selfcare/choice-number/ ఓపెన్ చేసి సంబంధిత బాక్స్‌లో మీ ప్రస్తుత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. 

ఆ తరువాత లాగిన్ ప్రక్రియను మీ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో పూర్తి చేయాలి. అక్కడుండే ఆప్షన్ల ప్రకారం వీఐపీ నెంబర్ ఎంచుకోవాలి. 

మీ వీఐపీ నెంబర్ సెలెక్షన్ నిర్ధారించేందుకు 499 రూపాయలు చెల్లించాలి. ఈ ప్రక్రియలో మీకు పోర్టల్‌లో అదనంగా కొన్ని నెంబర్లను జియో సూచిస్తుంది. మీ వీఐపీ నెంబర్ పైనల్ చేసేముందు ఆ సూచనలు గమనిస్తే మంచిది. అత్యంత తక్కువ ధరకు కావల్సిన నెంబర్‌ను ఎంచుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం బహుశా లభించకపోవచ్చు. 

Also read: Mobile Tower: మీ స్థలంలో మొబైల్ టవర్లను ఏర్పాటు భారీగా అద్దె.. నెలకు ఆదాయం ఎంతంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News