RBI Alert: మీ వద్ద ఉన్న పాత కరెన్సీ నోట్లు, నాణేలు విక్రయిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఆర్‌బీఐ కీలక అలర్ట్..

Selling Old Currency Notes and Coins: మీ వద్ద ఉన్న పాత కరెన్సీ నోట్లు లేదా నాణేలు విక్రయించాలని చూస్తున్నారా... అయితే ఈ ఆర్‌బీఐ అలర్ట్ మీకోసమే... 

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 07:46 PM IST
  • ఆర్‌బీఐ నుంచి కీలక అలర్ట్
  • ఆర్‌బీఐ లోగోతో ఆన్‌లైన్, ఆఫ్‌లెన్‌లో పాత కరెన్సీ క్రయ విక్రయాలు
  • ఆర్‌బీఐకి ఇలాంటి లావాదేవీల్లో ఎటువంటి ప్రమేయం లేదని స్పష్టీకరణ
RBI Alert: మీ వద్ద ఉన్న పాత కరెన్సీ నోట్లు, నాణేలు విక్రయిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఆర్‌బీఐ కీలక అలర్ట్..

Selling Old Currency Notes and Coins: పాత కరెన్సీ నోట్లు లేదా నాణేల క్రయవిక్రయాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కొన్ని ప్లాట్‌ఫామ్స్ పుట్టుకొచ్చాయి. మీ వద్ద ఉన్న పాత నోట్లు, నాణేలు అమ్మి పెడుతామంటూ కమిషన్ తీసుకుంటున్నాయి. అయితే ఈ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రకటన చేసింది. పాత నోట్లు, నాణేలు విక్రయించేవారు ఆర్‌బీఐ జారీ చేసిన ఈ సూచనలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఆర్‌బీఐ కీలక అలర్ట్ :

కొన్ని మోసపూరిత సంస్థలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అక్రమంగా  ఆర్‌బీఐ పేరు, లోగో వాడుతూ పాత కరెన్సీ నోట్లు, పాత నాణేల క్రయ, విక్రయాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్‌బీఐ గతంలో చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. పాత కరెన్సీ నోట్లు, నాణేలు అమ్మి పెట్టేందుకు ఆ సంస్థలు కమిషన్ వసూలు చేసినట్లు తెలిసిందని పేర్కొంది. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి కార్యకలాపాల్లో ఎప్పుడూ పాలు పంచుకోదని... ఎలాంటి ట్రాన్సాక్షన్స్‌కైనా ఎవరి నుంచి ఎటువంటి కమిషన్ లేదా ఫీజు వసూలు చేయదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇలా పాత కరెన్సీ నోట్లు, నాణేల క్రయ విక్రయాలకు ఏ సంస్థకు లేదా వ్యక్తులకు అనుమతినివ్వలేదని తెలిపింది. కాబట్టి మోసపూరిత సంస్థల చేతిలో చిక్కుకుని మోసపోవద్దని సూచించింది. 

Also Read: Flipkart Smart TV offers: ఫ్లిప్‌కార్ట్‌‌‌లో ఆఫర్ల పండగ... రూ.20 వేలు విలువ చేసే ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.849కే...   

Also Read: Flipkart Offer: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. రూ.20 వేలు విలువ చేసే ఈ టీవీ కేవలం రూ.499కే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News