Amrit Kalash Scheme: ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు చాలా పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే రీసెంట్ గానే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కింద పెట్టుబడి కోసం 'అమృత్ కలాష్ స్కీమ్' ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్ గడువు పూర్తి కాగా తాజాగా గడువును పొడిగించింది ఎస్బీఐ. ఇక తమ అధికారిక వెబ్సైట్లో కొంత సమాచారం పొందుపరిచారు.
ఇక ఆ సమాచారం ప్రకారం.. ఇది 400 రోజుల ప్రత్యేక ఎఫ్డి పథకమని.. ఇందులో పెట్టుబడిపై సామాన్యులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు పెట్టుబడిపై 7.60 శాతం వడ్డీ రేటు లభిస్తుంది అని పేర్కొన్నారు. అయితే గడువు పొడిగించడానికి కారణం మరొకటి ఉంది. మామూలుగా ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఆగస్టు 15 ముగిసింది. కానీ ఈ స్కీమ్ పట్ల అందరికీ ప్రయోజనం చేకూరాలన్న ఆలోచనలతో గడువు పొడిగించాడానికి బ్యాంకు నిర్ణయించినట్టు తెలిసింది.
ఇక ఇప్పుడు ఈ స్కీమ్ లో డిసెంబర్ 31 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 400 రోజుల ఎఫ్డి పతాకంపై గరిష్టంగా 7.60శాతం వడ్డీ రేటు అందుతుంది. ఇక ఏప్రిల్ 12 నుండి బ్యాంకు ఈ కొత్త రేట్లను అమలు చేసింది. అయితే ఈ పథకం కింద కస్టమర్లు మెచ్యూరిటీ పై వడ్డీని పొందుతారు. ఇక టీడీఎస్ మొత్తాన్ని తీసిన తర్వాత బ్యాంక్ వడ్డీ మొత్తాన్ని ఎఫ్డి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తుంది.
0.50 శాతం నుండి ఒక శాతం వరకు పెనాల్టీని చెల్లించడం వల్ల పథకం కింద 400 రోజులలోపు డిపాజిట్ ను ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మరొక ప్రయోజనం కూడా ఉంది. అంటే డిపాజిట్ చేస్తే దీనిపై లోన్ సౌకర్యం కూడా అందుతుంది. ఏడు రోజుల నుండి 45 రోజుల ఎఫ్ డి ల పై బ్యాంకు మూడు శాతం వడ్డీని అందిస్తుంది.
46 రోజుల నుండి 179 రోజుల ఎఫ్డి లపై 4.5శాతం, 108 నుండి 210 రోజుల ఎఫ్ డి పై 5.25శాతం, 211 రోజుల నుండి ఒక సంవత్సరం ఎఫ్ డి పై 5.75శాతం, ఒకటి నుండి రెండు సంవత్సరాల ఎఫ్డి పై 6.8శాతం, రెండు నుండి మూడు సంవత్సరాల ఎఫ్డి పై ఏడు శాతం, 3 నుండి 5 ఎఫ్డి ల పై 6.5 శాతం, ఇక ఐదు నుండి పది సంవత్సరాల ఎఫ్డి పై 6.5 శాతం. ఇక సీనియర్ సిటిజన్ లు 0.50 శాతం అధిక వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందుతున్నారు.
Also Read: Timesnow Survey: ఏపీలో ఈసారి అధికారం ఎవరిది, కేంద్రం పరిస్థితేంటి , సంచలన సర్వే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి