షేర్ మార్కెట్ అనేది అప్పటికప్పుడు అర్ధమయ్యేది కాదు. కాలక్రమంలో పరిశీలించే కొద్దీ అవగతమౌతుంది. ఇందులో కొన్ని షేర్లు నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో టాటా గ్రూప్‌కు చెందిన ఆ షేర్ ఎలా ఉందో పరిశీలిద్దాం..
టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ షేర్ ధర గత కొద్దిరోజులుగా వేగంగా పెరుగుతోంది. గత 6 నెలల్లో టాటా స్టీల్ షేర్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు ఆర్జించింది. 2022 డిసెంబర్ 12వ తేదీన ఎన్ఎస్ఈలో టాటా స్టీల్ 1.5 రూపాయలు పెరుగుదలతో 111.95 రూపాయలకు క్లోజ్ అయింది. అయితే టాటా స్టీల్ ధర ఇప్పటికీ 52 వారాల గరిష్టం కంటే తక్కువగా ఉంది. కానీ టాటా స్టీల్ 52 వారాల కనిష్టం కంటే ఎక్కువే ఉంది. 6 నెలల్లో టాటా స్టీల్ షేర్ ధర 52 వారాల కనిష్ట ధరను దాటింది.
టాటా స్టీల్ 52 వారాల కనిష్ట ధర 82.70 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది జూన్ నెలలో టాటా స్టీల్ 52 వారాల గరిష్టాన్ని చేరింది. కానీ ఆ తరువాత షేర్ ధర వేగంగా పెరగడం ప్రారంభమైంది. ఇప్పుడు టాటా స్టీల్ ధర 52 వారాల కనిష్టం కంటే 35 శాతం పెరిగి ఉంది. ప్రస్తుతం టాటా స్టీల్ షేర్ ధర 110 రూపాయలకు చేరుకుంది.
ఇన్వెస్టర్లకు ఈ షేర్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో గత 6 నెలల్లో షేర్ ధర 83 రూపాయల్నించి 110 రూపాయలకు పెరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలు కలిగాయి. అటు టాటా స్టీల్ 52 వారాల గరిష్ట ధర 138.67 రూపాయలుగా ఉంది.
Also read: Ban on Cigarettes: ఇక నుంచి 1-2 సిగరెట్లు కొనలేరు, ప్యాకెట్ కొనాల్సిందేనా, ఎప్పటి నుంచి అమలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook