SBI ATM Plan: ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీతో నెలకు 90 వేలు సంపాదించే అద్భుత అవకాశం

SBI ATM Plan: వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండేవారికి గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త అవకాశం కల్పిస్తోంది. నెలకు 90 వేల రూపాయలు సంపాదించే అద్భుత అవకాశమిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 14, 2024, 03:08 PM IST
SBI ATM Plan: ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీతో నెలకు 90 వేలు సంపాదించే అద్భుత అవకాశం

SBI ATM Plan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా బిజినెస్ ఆఫర్ చేస్తోంది. ఏటీఎం సంబంధించిన వ్యాపారమిది. క్రమం తప్పకుండా ప్రతినెలా 45 వేల నుంచి 90 వేల రూపాయలు ఇంట్లో కూర్చుని సంపాదించుకోవచ్చు. ఎస్బీఐ ఎటీఎం బిజినెస్ ఆఫర్ ఇది. 

ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజి బిజినెస్ ఆఫర్ ఇది. ఈ వ్యాపారంతో చాలామంది ఇంట్లో కూర్చుని వేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎస్బీఐ సూచించే కొన్ని నియమ నిబంధనలు వర్తిస్తే ఈ ఆఫర్ మీరు కూడా పొందవచ్చు. ఈ ఏటీఎం ఫ్రాంచైజ్ బిజినెస్ ఆఫర్ ఎలా ఉంటుందో వివరాలు పరిశీలిద్దాం. ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజ్ అనేది తక్కువ ఖర్చుతో చేసే వ్యాపారం. మీ లొకేషన్ ఆధారంగా చేయగలిగే వ్యాపారమిది. ఈ వ్యాపారంతో మీరు నెలకు 45 వేల నుంచి 90 వేల వరకూ సంపాదించవచ్చు. మీ ఏటీఎం ద్వారా రోజుకు 300 నుంచి 500 లావాదేవీలు జరిగితే కచ్చితంగా నెలకు 90 వేలు ఆర్జించవచ్చు.

ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ నెలకొల్పేందుకు 5 లక్షల వరకూ పెట్టుబడి అవసరమౌతుంది. ఇందులో 2 లక్షల రూపాయలు ఎస్బీఐకు ఇచ్చే రిఫండబుల్ డిపాజిట్. మిగిలిన 3 లక్షల రూపాయలు వర్కింగ్ కేపిటల్. ఒప్పంద కాలం కంటే ముందే ఏటీఎం నిర్వహణ నిలిపివేయాలనుకుంటే ఎస్బీఐ 1 లక్ష రూపాయలే వెనక్కి చెల్లిస్తుంది. నగదు లావాదేవీలకు ఒక్కొక్కటికి 8 రూపాయలు, నగదు రహిత లావాదేవీకు 2 రూపాయలు ఎస్బీఐ చెల్లిస్తుంది. 

ఎస్బీఐ ఫ్రాంచైజీ ఏటీఎం నియమాలు

50-80 చదరపు అడుగుల స్థలం అవసరమౌతుంది. నిర్దేశిత ఏటీఎంకు 100 మీటర్ల దూరంలో మరే ఇతర ఏటీఎం ఉండకూడదు. రోజుకు కనీసం 300 లావాదేవీలు ఉండేలా గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏటీఎం సెక్యూరిటీ నిమిత్తం ఆ గది స్ట్రాంగ్ కాంక్రీట్ రూఫింగ్‌తో ఉండాలి. ఏటీఎం విశాట్ ఇన్‌స్టాల్లేషన్ కోసం చుట్టుపక్కలవారి నుంచి నో అబ్జక్షన్ సర్ఠిఫికేట్ పొంది ఉండాలి.

ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచేజి కోసం కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇందులో పాన్‌కార్డ్, ఆధార్, వోటర్ ఐడీ ప్రూఫ్, ఎలక్ట్రిసిటీ బిల్, రేషన్ కార్డ్ , బ్యాంక్ పాస్‌బుక్‌లలో ఏదైనా ఒకటి అడ్రస్ ప్రూఫ్ కోసం అవసరమౌతాయి. దీంతోపాటు 4 పాస్‌పోర్ట్ ఫోటోలు, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్ ఫోన్ నెంబర్, జీఎస్టీ రిజిస్ట్రేషన్, , జీఎస్టీ నెంబర్ ఉండాలి. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ బ్యాలెన్స్ షీట్, లాభనష్టాలకు సంబందించి మూడేళ్ల ఎక్కౌంట్ ఉండాలి. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Also read: RIL Market Capitalization: రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డ్.. రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ అధిగమించిన తొలి భారత కంపెనీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News