SBI Interest Rates: ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తరువాత దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ.. ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జూన్ 14 అంటే రేపట్నించి అమల్లో రానున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 14, 2022, 08:07 PM IST
SBI Interest Rates: ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తరువాత దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ.. ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జూన్ 14 అంటే రేపట్నించి అమల్లో రానున్నాయి.

దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఎస్బీఐ జూన్ 14 నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచడంతో..ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జూన్ 14 నుంచి అమల్లో రానున్నాయి. కొత్త వడ్డీ రేట్లు..211 రోజుల్నించి మూడేళ్ల లోపున్న 2 కోట్ల కంటే తక్కువున్న డిపాజిట్లకు వడ్డీ రేట్లు వర్తించనున్నాయి.

ఎస్బీఐ ఎఫ్‌డి రేట్లు 2022

7 రోజుల్నించి 45 రోజుల వరకూ డిపాజిట్లకు 2.90 శాతం వడ్డీ, 46 రోజుల్నించి 179 రోజులవరకైతే 3.90 శాతం వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. అదే విధంగా 180 రోజుల్నించి 210 రోజుల వరకూ డిపాజిట్లకు 4.40 శాతం వడ్డీ వర్తించనుంది. 211 రోజుల్నించి 1 ఏడాది వరకైతే 4.40 శాతం నుంచి 4.60 శాతం వరకూ వడ్డీ పెంచింది. 1 ఏడాది నుంచి రెండేళ్ల వరకైతే వడ్డీ రేటు 5.30 శాతం వరకూ పెంచింది. 

2-3 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఇప్పుడు 5.35 శాతం వడ్డీ అందుతుంది. 3-5 ఏళ్ల వరకున్న డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం అదనంగా లభిస్తుంది. ఎస్బీఐ వి కేర్ పేరుతో సీనియర్ సిటిజెన్లకు ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఎస్బీఐ ప్రారంభించింది. ఈ పధకంలో వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు పెంచింది. 5-10 ఏళ్ల కోసమైతే..5.50 వడ్డీ రేటు ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్లకు మాత్రం 6.30 శాతం వడ్డీ వర్తిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ 30, 2022 వరకూ అందుబాటులో ఉంటుంది. 

Also read: Electric Scooter: సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌లో 132 కిమీ! అతి తక్కువ ధరకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News