TOP IPOs in 2024: ఈ ఏడాదిలో భారీ లాభాలు ఆర్జించిన ఐపీవోలు ఇవే

TOP IPOs in 2024: మరి కొద్ది గంటల్లో 2024 ముగుస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కొందరికి అనుకూలంగా, మరి కొందరికి ప్రతికూలంగా ఉండవచ్చు. అసలు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా నడిచిందో తెలుసుకుందాం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 31, 2024, 02:38 PM IST
TOP IPOs in 2024: ఈ ఏడాదిలో భారీ లాభాలు ఆర్జించిన ఐపీవోలు ఇవే

TOP IPOs in 2024: స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడూ ఐపీవోలు వస్తుంటాయి. కొన్ని లాభాలు ఆర్జిస్తుంటే మరి కొన్ని చతికిలపడుతుంటాయి. ఐపీవోల విషయంలో ఒక్కో ఏడాది ఒక్కోలా పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఏడాది అంటే 2024 మాత్రం ఐపీవో ఇయర్‌గా చెప్పవచ్చు. ఒకటి కాదు రెండు ఏకంగా 90కు పైగా ఐపీవోలు లాంచ్ అయ్యాయి. 

ప్రతియేటా ఐపీవోలు లాంచ్ అవడం పెద్ద విశేషమేమీ కాదు. లాంచ్ అయిన ఐపీవోల్లో ఎన్ని సక్సెస్ అయ్యాయి. ఎన్ని ఫెయిల్ అయ్యాయనేదే ముఖ్యం. అందుకే ఈ ఏడాది 2024ను ఐపీవో ఇయర్ అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎందుకంటే ఈ ఏడాది భారీ సంఖ్యలో అంటే 90కు పైగా కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించాయి. అంతేకాదు..భారీగా లాభాలు ఆర్జించిపెట్టాయి. ఇన్వెస్టర్లకు వరుస లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ ఐపీవోల్లో చాలావరకూ ప్రస్తుతం ఇష్యూ ప్రైస్ కంటే 65 శాతం ఎక్కువకు ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో 2024లో టాప్‌లో నిలిచిన కొన్ని ఐపీవోలు, వాటి లాభాలు, ఇష్యూ ప్రైస్ గురించి తెలుసుకుందాం.

ప్రీమియర్ ఎనర్జీస్ స్టాక్ ఇష్యూ ధర 450 రూపాయలు కాగా ప్రస్తుతం 191 శాతం లాభంతో 1309.8 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. ఇక కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ అండ్ రిఫ్రిజిరేషన్ స్టాక్ ఇష్యూ ధర 220 రూపాయలు కాగా ఏకంగా 233 శాతం లాభంతో 732 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక అన్నింటి కంటే టాప్‌లో జ్యోతి సీఎస్‌సి ఆటోమేషన్ స్టాక్ ఉంది. ఈ కంపెనీ స్టాక్ ఇష్యూ ధర 331 రూపాయలు కాగా 313 శాతం లాభంతో 1369 రూపాయల వద్ద ట్రేడింగులో ఉంది. 

ఇక 100-200 శాతం లాభాల్ని ఆర్జించిన స్టాక్‌లలో 159 శాతం లాభంతో మమతా మెషినరీ ఉంటే 156 శాతం లాభంతో భారతి హెక్సాకామ్ ఉంది. ప్లాటినం ఇండస్ట్రీస్ 148 శాతం లాభంతో ఉంటే గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ 134 శాతం లాభాన్ని ఆర్జించింది. ఓరియంట్ టెక్నాలజీస్ 134 శాతం లాభంతో ట్రేడ్ అవుతుంటే మొబిక్విక్ సిస్టమ్స్ 125 శాతం లాభంతో ఉంది. 

తొలిరోజే టాప్ గెయినర్స్

ఇవి కాకుండా లిస్ట్ అయిన రోజే భారీ లాభాలు ఆర్జించిన కంపెనీల్లో వైభోర్ స్టీల్ ట్యూబ్స్ కంపెనీ 196 శాతం లాభంతో అగ్రస్థానంలో ఉంది. జీఎల్ఎస్ ఈ సర్వీసెస్ కూడా తొలిరోజు 171 శాతం లాభంతో అదరగొట్టింది. ఇక మమతా మెషినరీ సైతం 159 శాతం లాభం ఆర్జించింది. గత 17 ఏళ్లలో అత్యధికంగా ఐపీవోలు విడుదలైంది  ఈ ఏడాది డిసెంబర్ నెలలో. ఏకంగా 15కు పైగా కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చి 24,950 కోట్లు సమీకరించాయి. అంతకుముందు 2007 ఫిబ్రవరి నెలలో 18 ఐపీవోలు వచ్చాయి. 

Also read: Liquor Sales: మందుబాబులకు శుభవార్త, ఇక ఆర్ధరాత్రి 1 గంట వరకూ కిక్కే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News