Stocks to Buy Today: రూ 100 కంటే తక్కువ ధరలోనే రాబోయే 2 - 3 నెలల్లో 46% వరకు రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్

Stocks to Buy Today: గడిచిన ఎనిమిది ట్రేడింగ్ సెషన్స్ నుంచి వరుసగా వృద్ధి నమోదు చేసుకున్న స్టాక్ మార్కెట్ బుధవారం మరోసారి ఒత్తిడికి గురైంది. నేటి స్టాక్ మార్కెట్ సరళి ఎలా ఉన్నప్పటికీ.. రాబోయే 2 - 3 నెలల్లో కొన్ని స్టాక్స్ లో మరింత వృద్ధి నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌ చెబుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2023, 04:51 AM IST
Stocks to Buy Today: రూ 100 కంటే తక్కువ ధరలోనే రాబోయే 2 - 3 నెలల్లో 46% వరకు రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్

Stocks to Buy Today: గడిచిన ఎనిమిది ట్రేడింగ్ సెషన్స్ నుంచి వరుసగా వృద్ధి నమోదు చేసుకున్న స్టాక్ మార్కెట్ బుధవారం మరోసారి ఒత్తిడికి గురైంది. నేటి స్టాక్ మార్కెట్ సరళి ఎలా ఉన్నప్పటికీ.. రాబోయే 2 - 3 నెలల్లో కొన్ని స్టాక్స్ లో మరింత వృద్ధి నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌కు చెందిన అనుజ్ గుప్తా తెలిపారు. రూ. 100 కంటే తక్కువ ధరలోనే లభించే ఐదు స్టాక్స్ ని కొనుగోలు చేయొచ్చని అనుజ్ గుప్తా సలహా ఇచ్చారు. ఆ ఐదు రకాల స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం రండి.

IDFC First Bank : ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ షేర్స్ 25% పెరిగే అవకాశం
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ స్టాక్ ప్రస్తుతం రూ.64.75 వద్ద ట్రేడ్ అవుతోంది. రాబోయే 2 - 3 నెలల్లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రూ.80 వరకు పెరిగే అవకాశం ఉందని.. అలాగే రూ.53 స్టాప్ లాస్ గా భావించవచ్చని ఐఐఎఫ్ఎల్ పేర్కొంది. గడిచిన ఒక్క నెలలోనే ఈ స్టాక్ 17 శాతం లాభపడింది. ప్రస్తుతం ఉన్న ధరతో పోల్చుకుంటే ఈ కంపెనీ స్టాక్ టార్గెట్ ధర 25 శాతం అధికంగా ఉంది. అంటే 25 శాతం రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నామాట.

UCO Bank : యూకో బ్యాంకు షేర్స్‌లో 46% ఉండనున్న అప్‌సైడ్ టార్గెట్
యూకో బ్యాంక్ షేర్ ప్రస్తుతం 3.5 శాతం క్షీణించి రూ.29.65 వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఈ స్టాక్ రూ.45 వరకు పెరిగే అవకాశం ఉందని.. అలాగే రూ.22 లను స్టాప్ లాస్ గా భావించవచ్చని ఐఐఎఫ్ఎల్ అభిప్రాయపడింది. ఒక నెల రోజుల వ్యవధిలోనే 14 శాతం లాభపడిన ఈ బ్యాంక్ స్టాక్.. రాబోయే రెండు, మూడు నెలల్లో 46 శాతం లాభపడే అవకాశం ఉంది అని ఐఐఎఫ్ఎల్ స్పష్టంచేసింది. 

MRPL : మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ స్టాక్ 24% అప్‌సైడ్ టార్గెట్
మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ ( ఎంఆర్‌పిఎల్ ) స్టాక్ ప్రస్తుతం 2.75 శాతం లాభపడి రూ.62.25 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ కంపెనీ షేర్స్ రూ.75 వరకు పెరిగే అవకాశం ఉండగా.. రూ.49 స్టాప్ లాస్ గా నిర్ణయించినట్టు ఐఐఎఫ్ఎల్ పేర్కొంది. వారం రోజుల్లో దాదాపు 14 శాతం లాభపడిన ఈ కంపెనీ స్టాక్స్ రాబోయే 2-3 నెలల్లో 24 శాతం రిటర్న్స్ అందివ్వనున్నట్టు ఐఐఎఫ్ఎల్ నివేదిక పేర్కొంది.

HUDCO : హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్టాక్ ధరలో 25% అప్‌సైడ్ టార్గెట్
హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( హడ్కో ) స్టాక్ ప్రస్తుతం రూ.53 వద్ద ట్రేడ్ అవుతుండగా.. రాబోయే రోజుల్లో ఈ స్టాక్ ధర రూ.65 ల మార్క్ ని తాకుతుందని.. అలాగే కనిష్టంగా రూ.40 స్టాప్ లాస్ ఉంటుందని ఐఐఎఫ్ఎల్ అంచనాలు వేసింది. ఇప్పటికే ఒక నెల రోజుల్లో 19 శాతం లాభపడిన ఈ స్టాక్స్.. రానున్న రోజుల్లో 25 శాతం పెరిగే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ నివేదికలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి : Money Earning Business Ideas: ఏడాదికి 40 లక్షల లాభం తెచ్చిపెట్టిన బిజినెస్

Ircon International : ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ ధరలో 22% అప్‌సైడ్ టార్గెట్
ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేరు ప్రస్తుతం రూ.85 వద్ద ట్రేడ్ అవుతోంది. రానున్న రోజుల్లో ఇది రూ.105 వరకు పెరిగే అవకాశం ఉందని.. ఒకవేళ పడిపోవడం అంటూ జరిగితే.. రూ.63 వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఐఐఎఫ్ఎల్ అంచనాలు స్పష్టంచేస్తున్నాయి. వారంలో 23 శాతం, నెలలో 47 శాతానికి పైగా పెరిగిన ఈ స్టాక్ రాబోయే రోజుల్లో మరో 22 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి. 

( ముఖ్య గమనిక : స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు సొంతంగా ఆలోచించి లేదా మీ సలహాదారుని సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సలహా బ్రోకరేజ్ హౌజ్ వేసిన అంచనాలు మాత్రమే కానీ జీ తెలుగు న్యూస్ సొంత అభిప్రాయాలు కాదు అని గుర్తించాల్సిందిగా మనవి )

ఇది కూడా చదవండి : Smartphones Under Rs 10000: 10 వేలకంటే తక్కువ ధరలో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News