Sukanya Samriddhi Yojana: రోజుకు 416 రూపాయలతో 21 ఏళ్లలో మీ అమ్మాయి 65 లక్షలు సంపాదించే మార్గం ఇదే

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది ప్రత్యేకించి అమ్మాయిల కోసం ఉద్దేశించింది. అమ్మాయిల భవిష్యత్ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రూపకల్పన చేసిన ఈ పధకం..గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 8, 2022, 08:09 PM IST
Sukanya Samriddhi Yojana: రోజుకు 416 రూపాయలతో 21 ఏళ్లలో మీ అమ్మాయి 65 లక్షలు సంపాదించే మార్గం ఇదే

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది ప్రత్యేకించి అమ్మాయిల కోసం ఉద్దేశించింది. అమ్మాయిల భవిష్యత్ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రూపకల్పన చేసిన ఈ పధకం..గురించి తెలుసుకుందాం.

మీకు ఓ అమ్మాయి ఉంటే..ఆ అమ్మాయి భవిష్యత్ ఆర్ధికంగా బాగుండాలని కోరుకుంటే..డబ్బుల సమస్య లేకుండా ఉండాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పధకం అద్భుతమైంది. ఈ ప్రత్యేక పథకంలో పెట్టుబడి పెడితే మీ అమ్మాయి 21 ఏళ్ల వయస్సు వచ్చేసరికి లక్షాధికారి అవుతుంది. ఈ పథకంలో మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రోజూ 416 రూపాయలు ఈ పధకం కోసం కేటాయించాలి. రోజుకు 416 రూపాయల చొప్పున..సేవ్ చేస్తుంటే..మీ అమ్మాయి కోసం 65 లక్షలు కూడబెట్టవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన అనేది దీర్ఘకాలిక పధకం. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ అమ్మాయి చదువు, భవిష్యత్ కోసం నిశ్చితంగా ఉంటుంది. దీనికోసం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ అమ్మాయి 21 ఏళ్ల వయస్సుకు వచ్చేసరికి ఎంత డబ్బులు అవసరమనేది ముందుగా నిర్ణయించుకుంటే...దాని ప్రకారం పెట్టుబడి పెట్టవచ్చు.

ఇది అమ్మాయిల భవిష్యత్తు సంరక్షించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఓ మంచి పధకం. పదేళ్ల వయస్సు అమ్మాయిలకు సుకన్య సమృద్ధి యోజన పధకంలో ఎక్కౌంట్ తెరవవచ్చు. ఇందులో కనీసం 250 రూపాయలు, అత్యధికంగా 1.5 లక్షల రూపాయలు ఏడాదికి జమ చేయవచ్చు. మీ అమ్మాయి 21 ఏళ్లు వచ్చినప్పుడు ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. అయితే మీ అమ్మాయికి 18 ఏళ్లు వచ్చేవరకూ ఈ సేవింగ్ స్కీమ్ లాక్ అయుంటుంది. 18 ఏళ్ల తరువాతే ఈ స్కీమ్ నుంచి 50 శాతం నగదు తీయవచ్చు. అది కూడా ఆ అమ్మాయి చదువు కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మిగిలింది 21 ఏళ్లు పూర్తయిన తరువాతే తీయగలరు. 

ఈ స్కీమ్‌లో పూర్తిగా 21 ఏళ్లు నిండేవరకూ డబ్బులు జమ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కౌంట్ తెర్చినప్పటి నుంచి ఆ అమ్మాయికి 15 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ జమ చేస్తే చాలు. 21 ఏళ్ల వరకూ ఆ డబ్బుపై వడ్డీ చేరుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం 7.6 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ స్కీమ్ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలుంటే..ఆ ఇద్దరికి కూడా తెరవవచ్చు. ఒకవేళ కవలలుంటే...ముగ్గురు అమ్మాయిలకు ఎక్కౌంట్ తెరవవచ్చు.

మీ అమ్మాయి వయస్సు ఏడాది ఉన్నప్పుడు 2022లో ప్రారంభిస్తే..రోజుకు 416 రూపాయలు చొప్పున నెలకు 12 వేల 5 వందల రూపాయలు సేవ్ చేయాలి. అంటే ఏడాదికి 1 లక్షా 50 వేల రూపాయలవతుంది. ఈ పెట్టుబడిని మీరు 15 ఏళ్ల వరకూ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు పెట్టే పెట్టుబడి 22 లక్షల 50 వేల రూపాయలు. 7.6 శాతం ఏడాది వడ్డీ చొప్పున మీకు లభించే వడ్డీ  42 లక్షల 50 వేల రూపాయలు. అంటే 2043లో మీ అమ్మాయి 21 ఏళ్లు పూర్తయ్యేసరికి స్కీమ్ మెచ్యూర్ అయినప్పుడు మీకు లభించే నగదు 65 లక్షల రూపాయలు. 

Also read: UPI linking with Credit Card: త్వరలో క్రెడిట్ కార్డుతో యూపీఐ అనుసంధానం, కలిగే ప్రయోజనాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News