2023 Tata Cars Discounts: టాటా కార్లపై 35 వేల వరకు తగ్గింపు.. ఆఫర్‌కు ఇదే చివరి తేదీ!

Tata Altroz and Tata Harrier have 2023 May Discounts.  31 వరకు చెల్లుబాటులో ఉండే క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో ఈ మోడళ్లపై ఆఫర్లు ఇవ్వబడుతున్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : May 5, 2023, 06:04 PM IST
2023 Tata Cars Discounts: టాటా కార్లపై 35 వేల వరకు తగ్గింపు.. ఆఫర్‌కు ఇదే చివరి తేదీ!

Tata Tiago, Tata Tigor, Tata Altroz and Tata Harrier have 2023 May Discounts: భారతీయ మార్కెట్లో కార్లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ వాహనాలకు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా భారీ క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ దృష్ట్యా వాహన సంస్థలు అన్ని ఎప్పటికప్పుడు సరికొత్త వాహనాలను తీసుకొస్తున్నాయి. అయితే 2023 మే నెలలో టాటా మోటార్స్ కంపెనీ టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, హారియర్ మరియు సఫారీలపై రూ.35,000 వరకు ఆఫర్‌లను అందిస్తోంది. మే 31 వరకు చెల్లుబాటులో ఉండే క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో ఈ మోడళ్లపై ఆఫర్లు ఇవ్వబడుతున్నాయి. అవేంటో ఇపుడు చూద్దాం. 

2023 May Discounts on Tata Cars:

# టాటా టియాగో కారుపై రూ. 20,000 నగదు తగ్గింపు ఉంది. ఇందులో రూ. 10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ మరియు రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. మొత్తం తగ్గింపు ఆఫర్‌ రూ. 35,000గా ఉంటుంది.

# టాటా టిగోర్ కూడా రూ. 20,000 నగదు తగ్గింపను అందిస్తోంది. ఇందులో రూ. 10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ మరియు రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు అందించబడుతోంది.  మొత్తంగా తగ్గింపు రూ. 35,000కి చేరుకుంది.

# టాటా ఆల్ట్రోజ్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు ఉంది. ఇందులో రూ. 10,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మరియు రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంటుంది. మొత్తంగా ఈ తగ్గింపు ఆఫర్‌ రూ. 28,000 వరకు ఉంటుంది.  

# టాటా హారియర్‌పై నగదు తగ్గింపు లేదు. అయితే రూ. 25,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మరియు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. మొత్తం తగ్గింపు ఆఫర్‌ను రూ. 35,000 వరకు ఉంటుంది.

# టాటా సఫారిలో క్యాష్ డిస్కౌంట్ కూడా ఇవ్వబడదు. హారియర్ లాగా ఇది కూడా రూ. 25,000 ఎక్స్చేంజ్ ఆఫర్ మరియు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ కారుపై మొత్తం రూ.35,000 ఆఫర్ ఉంది.

# ఈ తగ్గింపు ఆఫర్‌లు మోడల్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటాయి. ఒకే మోడల్ యొక్క విభిన్న వేరియంట్‌లపై విన్న ఆఫర్‌లు ఉంటాయి. కారు కొనడానికి ముందు, డీలర్‌షిప్ వివరాల గురించి మరింత తెలుసుకోండి. అయితే ఏ కారుపై ఉన్న ఆఫర్‌లను చూసి కొనుగోలు చేయవద్దు. మీ అవసరాలు మరియు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేస్తే మంచిది. 

Also Read: SRH vs KKR: టాస్‌ నెగ్గిన కోల్‌కతా.. ఇరు జట్లలో కీలక మార్పులు! తుది జట్లు ఇవే

Also Read: Ramabanam : రామబాణం థియేటర్ కౌంట్.. బ్రేక్ ఈవెన్ ఎంత, బిజినెస్ ఎంత జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News