Tata Motors Vs Hyundai in April: కార్లలో ప్యాసింజర్ వెహికల్స్ ప్రస్తుతం భారీ డిమాండ్ నెలకొంది. ఈ రంగంలో మారుతి సుజుకి ప్రతి నెలా 40 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో నంబర్ వన్‌గా కొనసాగుతోంది. ఇక సెకెండ్ ప్లేస్ కోసం రేసు చాలా ఆసక్తికరంగా మారింది. హ్యుందాయ్ చాలారోజులుగా అమ్మకాల పరంగా రెండోస్థానంలో కొనసాగుతుండగా.. టాటా మోటార్స్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది. ఇటీవ టాటా మోటార్స్ కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్నేళ్లగా టాటా మోటార్స్ మెరుగైన నాణ్యత, పనితీరుతో కార్లను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. అయితే ఏప్రిల్ నెలలో అమ్మకాల పరంగా ఏప్రిల్ నెలలో హ్యుందాయ్‌ను అధికమిచంలేదు.
Also Read: 2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?
ఈ ఏడాది ఏప్రిల్‌లో హ్యుందాయ్ 50,201 కార్లను విక్రయించగా.. టాటా మోటార్స్ గత నెలలో 47,883 వాహనాలను విక్రయించి గట్టి పోటీనిచ్చింది. అయితే గతేడాది ఇదే నెలతో పోలిస్తే రెండు కార్ల కంపెనీల విక్రయాల్లో స్వల్ప పెరుగుదల ఉంది. హ్యుందాయ్ విక్రయాలు ఒక శాతం, టాటా మోటార్స్ రెండు శాతం అమ్మకాలు పెరిగాయి. ఈ ఏడాది మార్చి నెలలో కూడా హ్యుందాయ్ నంబర్-2 రేసులో స్వల్ప ఆధిక్యాన్ని కొనసాగించింది. హ్యుందాయ్ 53 వేల కార్లను విక్రయించగా.. టాటా మోటార్స్ 50,110 వాహనాలను విక్రయించింది.
ఈ రెండు బ్రాండ్‌లు మన దేశంలో సెకెండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. అనేక రకాల కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అయితే హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల అధికారిక గణాంకాలను ఇంకా రిలీజ్ చేయలేదు. టాటా మోటార్స్ మార్చిలో 6,364 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం విశేషం. రెండు కంపెనీల కూడా వారి SUV శ్రేణులు అత్యధిక వాల్యూమ్‌ను ఉత్పత్తి చేస్తున్న విషయం మీకు తెలిసిందే. మార్కెట్ ట్రెండ్ SUVలకు అనుకూలంగా ఉండటంతో ఈ రెండు కంపెనీలు కూడా భారీగా లాభాలను అర్జించాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా 41,008 వాహనాలను విక్రయించింది. గతేడాది ఏప్రిలోలో 34,694 వాహనాలను విక్రయాలతో పోలిస్తే.. దాదాపు 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. టయోటా ఏప్రిల్‌లో 20,494 వాహనాలను విక్రయించింది. గతేడాది కంటే 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదేవిధంగా హోండా కూడా అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నెలలో 10,867 వాహనాలను విక్రయించగా.. ఇది గత ఏడాది కంటే ఏప్రిల్ 2023లో విక్రయించిన 7,676 వాహనాల నుండి పెరిగింది.
Also Read: Online Games: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన విద్యార్థులు.. సొంతింట్లోనే రూ.40 లక్షల ఆభరణాలు చోరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter