Investment Tips: పెట్టుబడికి ప్లాన్ చేస్తున్నారా..? ఈ పది టిప్స్ పాటించండి

Tips For Investment: ప్రస్తుతం చాలా మంది వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. ఓవైపు ఉద్యోగాలు చేస్తునే.. పెట్టుబడి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే తొందరపడి పెట్టుబడి పెట్టకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీ జేబు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 04:08 PM IST
Investment Tips: పెట్టుబడికి ప్లాన్ చేస్తున్నారా..? ఈ పది టిప్స్ పాటించండి

Tips For Investment: డబ్బు సంపాదించేందుకు మార్గాలు అనేకం. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించేవారు కొందరైతే.. మరికొందరు వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కొంతమంది తమ సంపాదనను పొదుపుగా దాచి పెడితే.. ఇంకొందరు తమ సంపాదనను కూడా పెట్టుబడిగా పెడతారు. పెట్టుబడి ద్వారా మీ సంపాదన నుంచి చేసిన పొదుపుపై ​​కూడా మంచి రాబడిని పొందవచ్చు. అధిక రాబడిని పొందే పెట్టుబడి మార్గాలు చాలా ఉన్నాయి.

ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే పెట్టుబడి ముందు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. చాలా పెట్టుబడి మాధ్యమాలు ప్రమాదకరమైనవి. ముందు అనుకున్న పెట్టుబడి కంటే.. ఖర్చు ఎక్కువ కావచ్చు. ముందుగా ప్లాన్ చేసుకోవాలి. తక్కువ రిస్క్ పెట్టుబడి ద్వారా అధిక రాబడి ఉండదు. అయినా వాటిలో పెట్టుబడి పెడితే.. మన డబ్బు సురక్షితంగా ఉంటుంది. పెట్టుబడి ప్రారంభంలో కొన్ని విషయాలను పట్టించుకోకపోతే నష్టాలు కూడా చవిచూడాల్సి రావచ్చు.

మొదటి సారి పెట్టుబడిదారుల కోసం టాప్ 10 చిట్కాలు

- మీరు పెట్టుబడి ముందే ప్రణాళికను తయారు చేసుకోండి
- పెట్టుబడిలో ఉన్న నష్టాన్ని అంచనా వేయండి
- పెట్టుబడి ట్యాక్స్‌ను ఎలా ఆదా చేస్తుందో తెలుసుకోండి
- మీ పెట్టుబడిని వైవిధ్యంగా ఉంచండి 
- మీ దగ్గరు ఉన్న డబ్బును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టండి
- మీరు ఇన్వెస్ట్ చేస్తున్న చోట హిస్టరీని చూసి ఇన్వెస్ట్ చేయకండి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టండి.
- క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి.
- ఇన్వెస్ట్‌మెంట్ ఎంతకాలం పెడుతున్నారో గుర్తుంచుకోండి.
- ఏదైనా మాధ్యమంలో పెట్టుబడి కాలపరిమితి ముగిసిపోతే.. రెండుసార్లు పెట్టుబడి పెట్టండి.
- పెట్టుబడి సమయంలో మరొకరిని చూసి పెట్టుబడి పెట్టకండి. మీ సొంత అవగాహనను ఉపయోగించి పెట్టుబడి పెట్టండి.

Also Read: Man Raped Dog: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! వైరల్ వీడియో  

Also Read: Mrunal Thakur Pics: వెల్వెట్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్.. ఫ్రెంట్, బ్యాక్ చూపిస్తూ హీటుపుట్టిస్తున్న సీత!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News