Best Bluetooth Speakers Under Budget: మన జీవనశైలిలో సంగీతం ఒక భాగం. మానసిక ప్రశాంతత.. మానసికోల్లాసం కోసం రోజుకు కొన్ని పాటలు లేదా సంగీతం వినడం మంచి అలవాటు. దీనివలన అలసట అనేది మట్టుమాయమై రోజంతా జోష్‌గా ఉంటాం. ఈ పాటలు వినడానికి ఫోన్‌లో కాకుండా బ్లూటూత్‌లు వాడుతుంటాం. సౌండ్ ఎక్కువ.. మంచి బేస్‌తో వింటే ఆ పాటలు మరింత వినసొంపుగా ఉంటాయి. మరి అలాంటి బ్లూటూత్‌లలో ఏవి మంచివి..? ఎంత మన్నికైనవి అని వినియోగదారులు శోధిస్తున్నారు. ఇంటర్నెట్‌లో చాలా బ్లూటూత్‌లు కనిపిస్తుంటాయి. కానీ నాణ్యమైన మంచి సౌండ్ క్వాలిటీతో ఉండే బ్లూటూత్‌లు ఏవో తెలియవు. ఆన్‌లైన్ షాపింగ్‌లో వెతికితే కో కొల్లలుగా కనిపిస్తాయి. వాటిలో మంచి బ్లూటూత్ వెతకడం చాలా కష్టం. మీకు శ్రమ లేకుండా అత్యుత్తమ టాప్ 5 బ్లూటూత్‌లు మీకు పరిచయం చేస్తున్నాం.
1. జిబ్రానిక్స్ జెబ్ కౌంటీ
ప్రస్తుతం బ్లూటూత్ పరికరాలలో జెబ్రానిక్స్ నంబర్ వన్‌గా నిలుస్తోంది. మంచి సౌండ్ క్వాలిటీతో ఈ బ్లూటూత్ స్పీకర్ ఉంది. 3 డబ్ల్యూ ఆర్‌ఎంఎస్ పవర్ కలిగి ఉన్న ఈ స్పీకర్‌లో సౌండ్ క్లారిటీగా వస్తుంది. బ్లూటూత్‌తోపాటు మెమోరీ కార్డు, ఆక్సా పిన్, ఎఫ్‌ఎం రేడియో వంటి సదుపాయాలు ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఆరు గంటల పాటు నిరాటంకంగా ఈ స్పీకర్ పని చేస్తుంది. ఒక్క నలుపే కాకుండా చాలా రకాల రంగుల్లో ఈ స్పీకర్ అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో జిబ్రానిక్స్ జెబ్ కౌంటీ అని సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఇది రూ.500కే లభిస్తుండడం విశేషం.
Also Read: Vijay Sekhar Sharma: మరింత ముదిరిన 'పేటీఎం సంక్షోభం'.. చైర్మన్ పదవికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా
- బ్రాండ్: జిబ్రానిక్స్
- మోడల్ పేరు: జెబ్ కౌంటీ
- స్పీకర్ రకం: ఔట్‌డోర్
- కనెక్టివిటీ టెక్నాలజీ (వేటికి కనెక్ట్ చేసుకోవచ్చు): బ్లూటూత్, యాక్సిలరీ, యూఎస్‌బీ, వైర్‌లెస్
- ప్రత్యేక ఫీచర్: యూఎస్‌బీ పోర్ట్, పోర్టబుల్
2. బోట్ స్టోన్ 650
బ్లూటూత్ స్పీకర్‌లలో బోట్ స్టోన్ 650 అత్యుత్తమైనది. ఈ స్పీకర్ 10 డబ్ల్యూ ఆర్‌ఎంఎస్ పవర్ కలిగి ఉంది. ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) బ్లూటూత్ ద్వారా వస్తుంది. చార్జింగ్ పెట్టిన తర్వాత ఏడు గంటల పాటు ఈ స్పీకర్‌లో సంగీతం వినవచ్చు. సరికొత్త ఆకృతిలో ఉన్న ఈ బ్లూటూత్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక్క రంగులో కాకుండా అనేక రంగుల్లో ఈ బ్లూటూత్ అందుబాటులో ఉంది. ఈ స్పీకర్ రూ.2 వేల వరకు ధర ఉండే అవకాశం ఉంది.
Also Read: PayTm: పేటీఎమ్‌కు భారీ ఊరట.. ఆర్బీఐ ప్రకటనతో యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చా లేదా?
- బ్రాండ్: బోట్
- మోడల్ పేరు: స్టోన్ 650
- స్పీకర్ రకం: సబ్ ఊఫర్
- కనెక్టివిటీ టెక్నాలజీ (వేటికి కనెక్ట్ చేసుకోవచ్చు): బ్లూటూత్ మాత్రమే
- ప్రత్యేక ఫీచర్: పోర్టబుల్, నీటిలో పడినా ఏం కాదు, డస్ట్ ప్రూఫ్
3. మివి రోమ్ 2
రూ.2 వేల ధరలో ఉన్న అత్యుత్తమ బ్లూటూత్ స్పీకర్‌లలో మివి రోమ్ 2 ఒకటి. 5 డబ్ల్యూ ఆర్‌ఎంఎస్ పవర్ కలిగి ఉన్న ఈ స్పీకర్‌లో సౌండ్ నాణ్యతగా వినిపిస్తుంది. ఐపీఎక్స్7 నీటిలో అర్ధ గంట పాటు ఉన్నా కూడా ఈ స్పీకర్‌కు ఏమీ కాదు. ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ ఉన్న ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 24 గంటల పాటు అంటే రోజంతా సంగీతం వినవచ్చు.
- బ్రాండ్: మివి
- మోడల్ పేరు: రోమ్ 2
- స్పీకర్ రకం: ఫుల్ రేంజ్
- కనెక్టివిటీ టెక్నాలజీ (వేటికి కనెక్ట్ చేసుకోవచ్చు): బ్లూటూత్, వైర్‌లెస్
- ప్రత్యేక ఫీచర్: పోర్టబుల్, నీటిలో పడినా ఏం కాదు, యూఎస్‌బీ పోర్ట్, మైక్రోఫోన్, బాస్ బూస్ట్
4. ఇన్ఫినిటి- జేబీఎల్ క్లబ్జ్ మినీ
అత్యుత్తమ సౌండ్‌తో క్లియర్‌గా సంగీతం వినిపించే బ్లూటూత్ స్పీకర్ ఇన్ఫినిటి- జేబీఎల్ క్లబ్జ్ మినీ. పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌గా ఉన్న ఇది ప్రత్యేక డిజైన్‌లో రూపొందించారు. డీప్ బాస్ సౌండ్ జేబీఎల్ మాదిరి సౌండ్ వినిపిస్తుంది. ఇన్‌బిల్ట్‌గా మైక్రోఫోన్ ఉండడంతో ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. చాలా రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ స్పీకర్ చార్జింగ్ పెట్టిన అనంతరం ఐదు గంటలపాటు పాటలు వినవచ్చు. ఈ స్పీకర్ రూ.2 వేల వరకు ధర ఉండవచ్చు.
- బ్రాండ్: ఇన్ఫినిటీ
- మోడల్ పేరు: జేబీఎల్ క్లబ్జ్ మినీ
- స్పీకర్ రకం: బుక్ షెల్ఫ్
- కనెక్టివిటీ టెక్నాలజీ (వేటికి కనెక్ట్ చేసుకోవచ్చు): బ్లూటూత్, వైర్‌లెస్
- ప్రత్యేక ఫీచర్: పోర్టబుల్, స్పీకర్ ఫోన్
5. మివీ ప్లే
అతి తక్కువ బడ్జెట్‌లో మివీ ప్లే బ్లూటూత్ స్పీకర్ అందుబాటులో ఉన్నది. ధర తక్కువైనా ఫీచర్లు, ఎన్నో ప్రత్యేకతలతో ఈ స్పీకర్ ఉంది. 5డబ్ల్యూ ఆర్‌ఎంఎస్ పవర్ కలిగి ఉన్న ఈ స్పీకర్‌లో సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ కలిగి ఉన్న ఈ స్పీకర్‌లో స్టూడియోలో ఉన్న మాదిరి సౌండ్ వస్తుంది. ఐపీఎక్స్7 నీటిలో 30 నిమిషాల పాటు ఉన్నా కూడా ఈ స్పీకర్‌కు దెబ్బ తినదు. ఈ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.649 వరకు ఉంటుంది.
- బ్రాండ్: మివి
- కనెక్టివిటీ టెక్నాలజీ (వేటికి కనెక్ట్ చేసుకోవచ్చు): బ్లూటూత్, ఆక్స్,
- ప్రత్యేక ఫీచర్: ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకునే అవకాశం.
గమనిక: ప్రస్తావించిన ధరలు ఎప్పటికప్పుడు మారవచ్చు. కొన్నిసార్లు ఆయా ఆన్‌లైన్ పోర్టల్స్ ఆఫర్స్ ద్వారా ధరల్లో మార్పులు ఉంటాయి.
Also Read: Brahmamudi Update: బుజ్జీప్లాన్ సక్సెస్.. గింజుకుంటున్న మిస్టర్ బడాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter